అక్బర్ పెద్ద కొడుకు మరియు మనం ఎంతో గొప్పగా చెప్పుకునే అనార్కలి ప్రియుడు సలీం గురించి చరిత్ర చెబుతున్న నిజాలు

స‌లీం, అనార్క‌లిల ప్రేమ క‌థ గురించి అంద‌రికీ తెలిసిందే క‌దా. మొగ‌ల్ చ‌క్ర‌వ‌ర్తుల సంస్థానంలో అనార్క‌లి ఓ చెలిక‌త్తె. బానిస జీవితాన్ని గ‌డుపుతూ ఉండేది. ఈ క్ర‌మంలోనే స‌లీంతో ప్రేమ‌లో ప‌డుతుంది. వీరిద్ద‌రి గురించి తెలిసిన అక్బ‌ర్ అనార్క‌లిని నాలుగు గోడ‌ల మ‌ధ్య స‌మాధి చేస్తాడు. క‌థ అంత‌టితో ముగుస్తుంది. అయితే నిజానికి ఈ అనార్క‌లి క‌థ వ‌ట్టిదే అని కొంద‌రు చ‌రిత్ర‌కారులు చెబుతారు. అనార్క‌లి నిజంగా ఉంద‌న‌డానికి సాక్ష్యాలు ఏమీ లేవ‌ని, ఆమె స‌మాధిగా చెప్ప‌బ‌డుతున్న నిర్మాణం కూడా వ‌ట్టిదే అని అంటారు. అయితే దీని విష‌యం పక్క‌న పెడితే నిజానికి స‌లీం గొప్ప ప్రేమికుడు మాత్రం కాదు, మ‌హిళ‌ల‌ను వేధించే ఓ క‌సాయి అని చెప్ప‌వ‌చ్చు. అవును, స‌లీం గురించిన ప‌లు షాకింగ్ విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

అక్బ‌ర్ పెద్ద కుమారుడు సలీంకు ఇంకో పేరు కూడా ఉంది. అదే జ‌హంగీర్‌. అదే పేరిట అత‌న్ని పిలుస్తారు. అయితే జ‌హంగీర్ ఓ కామ‌లాల‌సుడ‌ట‌. అత‌నికి ఉన్న భార్యలు స‌రిపోర‌ని చెప్పి 300 మందితో సంబంధాల‌ను అత‌ను క‌లిగి ఉండేవాడ‌ట‌. ఇత‌ని మొద‌టి భార్య పేరు మన్‌భ‌వ‌తి బాయి. ఈమెకు ఓ కుమారుడు జ‌న్మించాడు. అత‌ని పేరు ఖుస్రూ మిర్జా. ఇత‌నే జ‌హంగీర్ మొద‌టి కుమారుడిగా ప‌రిగ‌ణింప‌బ‌డ్డాడు. అనంత‌రం మ‌న్‌భ‌వ‌తి బాయి పేరు షా బేగంగా మారింది. అనంతరం ధ‌మేరి (ప్ర‌స్తుత హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌)కి చెందిన ఫుల్ బేగం అనే యువ‌తిని రెండో వివాహం చేసుకున్నాడు జ‌హంగీర్‌. ఇక ఇత‌ని మూడో భార్య జోద్ బాయి. జ‌గ‌త్ గొసెయిన్ అనే పేరు కూడా ఈమెకు ఉంది. ఈమె జ‌హంగీర్ రెండో కుమారుడికి జ‌న్మ‌నిచ్చింది. అత‌ని పేరు ఖుర్రం.

1586 జూలైలో బిక‌నీర్ మ‌హారాజు కుమార్తెను 4వ వివాహం చేసుకున్నాడు. అదే నెల‌లో క‌ష్గ‌ర్ సుల్తాన్ కుమార్తె మ‌లికా షిక‌ర్ బేగంను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈమె 1592లో చ‌నిపోయింది. త‌రువాత షాహిబ్ ఇ జ‌మాల్ అనే మ‌రో మ‌హిళ‌ను 6వ వివాహం చేసుకున్నాడు. ఈమెకు కూడా ఓ కుమారుడు జ‌న్మించాడు. అత‌ని పేరు ప‌ర్వీజ్ మిర్జా. అయితే ఈమె కూడా చ‌నిపోయింది. వీరే కాకుండా మ‌లికా ఇ జ‌హాన్ బేగం సాహిబా అనే మ‌హిళ‌ను, రాజా ద‌ర్యా మ‌ల్భాస్ కుమార్తెను, అబియా కాశ్మీరి అనే మ‌హిళ సోద‌రిని, క‌న్వాల్ రాణి అనే మ‌హిళ‌ను, స‌య్యిద్ ముబార‌క్ ఖాన్ అనే వ్య‌క్తి కుమార్తెను, హుస్సేన్ చాక్ అనే రాజు కుమార్తెను, సాలిహా బాను బేగం అనే మ‌హిళ‌ను, కోకా కుమారి సాహిబా అనే మ‌హిళ‌ను కూడా జ‌హంగీర్ వ‌రుస‌గా వివాహం చేసుకున్నాడు.

అయితే అంత మందిని వివాహం చేసుకున్నా, ఎంతో మంది మ‌హిళ‌ల‌ను బానిస‌లుగా చేసుకున్నా అత‌ను తృప్తి చెంద‌లేదు. అదే క్ర‌మంలో మెహ‌ర్‌-ఉన్‌-నిస్సా (నూర్ జ‌హాన్‌) అనే మ‌హిళ‌పై జ‌హంగీర్ క‌న్ను ప‌డింది. అయితే ఆమెకు అప్ప‌టికే పెళ్ల‌యింది. కానీ భ‌ర్త చ‌నిపోయాడు. దీంతో ఆమెను జ‌హంగీర్ లొంగ‌దీసుకోవాల‌నుకున్నాడు. కానీ అందుకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆమె మీద కోపాన్ని త‌న అంతఃపురంలోని స్త్రీల‌పై చూపించేవాడ‌ట‌. వారిని బాగా చిత్ర‌హింస‌ల‌కు గురి చేసేవాడ‌ట‌. అయితే అలా 3 ఏళ్లు గ‌డిచాక చివ‌ర‌కు ఎలాగో నూర్ జ‌హాన్‌ను అత‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ క్ర‌మంలో మిగిలిన అంద‌రు భార్య‌ల క‌న్నా నూర్ జ‌హాన్ అంటేనే జ‌హంగీర్ ఎక్కువ మ‌క్కువ చూపించేవాడ‌ట‌. అయితే ఆమె త‌రువాత కూడా అత‌ను చాలా మందిని వివాహం చేసుకున్న‌ట్టు చ‌రిత్ర చెబుతోంది..!
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)