పెళ్ళైన తర్వాత ఆడవాళ్లు బరువు పెరగడానికి కారణాలు ఇవే

పెళ్లి తరువాత ఆడవారిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా చాలామంది మహిళల్లో కనిపించే ముఖ్య లక్షణం బరువు పెరగడం. ఇది సహజమే అయినా దానికి గల కారణాలను అనేకమంది ఏవేవో అనుకొని భ్రమ పడుతూ ఉంటారు. ఎలాగైతే బరువు పెరగడం అందరిలో కామన్ సమస్య గా మారిందో, స్త్రీలు పెళ్లి అయిన తరువాత బరువు పెరగడం కూడా అంతే సహజం. దీనికి అనేకమంది అనుకొనే కారణం లైంగిక కలయిక. అయితే ఇది పాక్షిక సత్యం మాత్రమే. ఆడా మగా కలిసి సాగించే జీవన ప్రయాణంలో ఇది ఒక అంశం మాత్రమే.

శారీరక కలయిక వల్ల శరీర భాగాల్లో పెరుగుదల, నడుము ప్రాంతంలో కొవ్వు పెరగడం లాంటి మార్పులు జరిగినా, కేవలం అదే బరువు పెరగడానికి కారణం అనేది మాత్రం కేవలం అపోహ. స్త్రీలు పెళ్లి తరువాత బరువు పెరగడానికి అనేక ఇతర కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో ప్రధానమైంది ఆహార అలవాట్లలో మార్పులు. అప్పటివరకు తీసుకొనే ఆహార పదార్ధాలే కాదు.. ఆహారం తీసుకొనే సమయాలు ఒకటైతే, మెట్టినింట్లోకి అడుగుపెట్టాక అవన్నీ మారిపోతాయి. ఈ ప్రక్రియలో బరువు పెరగడం కూడా కామన్. అలాగే పిల్లలని జాగ్రత్తగా చూసుకోవడం, ఇంట్లో పనులన్నిటినీ చక్కపెట్టడం లాంటి ఒత్తిళ్లకు లోనవుతారు. ఒత్తిడి కూడా బరువు పెరగడానికి ప్రధానమైన కారణం అని చాలా పరిశోధనల్లో తేలింది.

అలాగే స్త్రీలు పెళ్లి కాకముందు ఎక్కువగా తీరిక ఉండడంతో వ్యాయామాలు చేస్తూ ఉంటారు. అదే పెళ్లి అనంతరం తగిన ఖాళీ దొరకక వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దాని వల్ల బరువు పెరుగుతారు. అయితే సమయానికి ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని అధిగమించడానికి యోగా, వ్యాయామం లాంటివి చేయడం ద్వారా అధిక బరువు నుండి విముక్తి పొంది మహిళలు ఆరోగ్యాంగా, పూర్వపు శరీర ఆకృతితో సన్నగా, నాజూగ్గా మారిపోవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)