ఫ్రెండ్స్ ముసుగులో ముగ్గురు యువకులు కామాంధుల్లా వ్యవహరించారు ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పే ఘటన ఇది

Loading...
ప్రకాశం జిల్లా కనిగిరిలో దారుణం చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. ఫ్రెండ్స్ ముసుగులో ముగ్గురు యువకులు కామాంధుల్లా వ్యవహరించారు. ఓ యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. పశువుల్లా వ్యవహరించడమే కాకుండా ఆ ఘోరాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు. ఆ యువతి ఆర్తనాదాలు చేస్తూ.. వదిలేయమని వేడుకున్నా.. ఆ కీచకులు కరుణించలేదు.. సరికదా మరింత రెచ్చిపోయారు. యువతిని వేధించి పైశాచిక ఆనందం పొందారు. ఆ అమ్మాయికి తోడుగా వచ్చిన మరో యువతి జరుగుతున్న అఘాయిత్యాన్ని అడ్డుకోవడానికి విఫలయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఏమాత్రం సిగ్గూ ఎగ్గూ లేకుండా.. ఆ నీచులు ఉదంతాన్నంతా తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. సభ్య సమాజం తలదించుకునేలా ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

స్థానిక డిగ్రీ కాలేజీలో చదువుతున్న బాధితురాలితో కార్తీక్‌ అనే యువకుడు ఫ్రెండ్ షిప్ చేసుకున్నాడు. ఈ క్రమంలో పిక్నిక్ పేరుతో తన మిత్రులతో కలిసి ఆ అమ్మాయిని సమీప పంటపొలాల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ పైశాచిక పర్వానికి తెరతీశాడు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన తర్వాత కార్తీక్ తన మిత్రుడిని ఆ అమ్మాయిపైకి ఉసిగొల్పాడు. ఆ దుర్మార్గుడు అత్యంత అమానుషంగా ఆ అమ్మాయి దుస్తులు లాగి.. కీచకపర్వం కొనసాగించాడు. ఆమె ఎంత వేడుకున్నా.. వాళ్ల మనసు కరగలేదు. ఓ వైపు బాధితురాలు నరకం అనుభవిస్తుండగా.. కార్తీక్‌, అతని స్నేహితులు తమ సెల్‌ఫోన్‌లో ఆ ఉదంతాన్ని చిత్రీకరించారు. అమ్మాయికి తోడుగా వచ్చిన మరో విద్యార్థిని ఈ ఘటనను నిలువరించే ప్రయత్నం చేసినా.. ఆ కీచకుల వినిపించుకోలేదు.

ఘటన అనంతరం ఆ మృగాళ్లు ఆ అమానుష దృశ్యాలను వాట్సాప్ ద్వారా మరికొంత మంది మిత్రులకు పంపించారు. పరువు పోతుందనే భయంతో బాధిత యువతి జరిగిన అవమానాన్ని తనలోనే దాచుకొని కుమిలిపోతుండగా.. ఆ వీడియో దృశ్యాలు వేగంగా వైరల్‌గా మారాయి. బాధితురాలి కుటుంబసభ్యుల దృష్టికి రావడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు రంగంలోకి దిగి ఆ అమానుషానికి ఒడిగట్టిన కార్తీక్‌ సహా ఇతర నిందితులపై అత్యాచారయత్నంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకొని అరెస్టు చేశారు. ఈ అమానుష పర్వం పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. ఆ కీచకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు ఆడపిల్లలను హెచ్చరిస్తున్నారు. ఫ్రెండ్స్ తో జాగ్రత్తగా ఉండాలని, గుడ్డిగా స్నేహితులను నమ్మరాదని సూచిస్తున్నారు. వీడియో చూడండి
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...