మదర్ థెరిసా అమ్మాయిలను విదేశాలకు ఎగుమతి చేసింది : పరిపూర్ణనంద తీవ్ర వ్యాఖ్యలు

భారత రత్న మదర్‌ థెరిస్సాపై కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణనంద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక ఛానల్ నిర్వహించిన చర్చ కార్యక్రమంలో కంచె ఐలయ్యతోపాటు పాల్గొన్న ఆయన… మదర్‌ థెరిస్సా అంశాన్ని ప్రస్తావించారు. మదర్ థెరిసా సేవ ముసుగులో 50 వేల మంది అమ్మాయిలను విదేశాలకు ఎగుమతి చేశారని ఆరోపించారు. ఆమెకు భారత రత్న ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఆమె గురించి అన్ని విషయాలు బయటపెడతా అని అన్నారు. ఎన్నో అడుక్కునే దేశాలుంటే భారత్‌కే ఆమె ఎందుకు వచ్చి సేవ చేసిందని పరిపూర్ణనంద ప్రశ్నించారు. అమ్మాయిలను ఎగుమతి చేసిన ఆమెకు భారత రత్న ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.

చర్చలో ఒక దశలో ఐలయ్యకు, పరిపూర్ణనందకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. తల్లిదండ్రుల పేర్లు చెప్పాల్సిందిగా ఐలయ్య అడగ్గా… పరిపూర్ణనంద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రుల పేర్లతో అవసరం ఏముందని ప్రశ్నించారు. ఏమైనా తనకు పిల్లనిస్తావా అని ప్రశ్నించారు. ఎదుటివారి మూలాల గురించి అడుతున్న పరిపూర్ణనందను ఆయన మూలాల గురించి ప్రశ్నిస్తే తప్పేంటని ఐలయ్య నిలదీశారు. తల్లిదండ్రుల పేర్లు చెప్పని పరిపూర్ణనందకు దేశం గురించి మాట్లాడే అర్హతే లేదని పట్టుబట్టారు. తల్లిదండ్రులు ఎవరో చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ఆగ్రహించిన పరిపూర్ణనంద.. తన తల్లిదండ్రుల పేర్లు చెప్పకుండా మైకు తీసేసి చర్చ మధ్యలోనే వెళ్లిపోయారు. తల్లిదండ్రుల వైపు నుంచి క్రిస్టియన్ మూలాలున్న కొందరు స్వాములు తామే హిందుత్వాన్ని రక్షించేస్తున్నట్టు అతి చేస్తున్నారని ఐలయ్య విమర్శించారు. అలా చేయకపోతే తమ అసలు రంగు బయటపడుతుందనే ఇలా వ్యవహరిస్తుంటారని ఐలయ్య విమర్శించారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)