లావు తగ్గాలంటే అల్లం, నిమ్మకాయ, వెల్లులి ఈ మూడు ఉంటె చాలు. వీటితో పొట్ట తగ్గించుకోవడం చాలా ఈజీ

 • పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరిగించేందుకు వ్యాయామాలతో పాటు రకరకాల ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉంటారు. ఇంట్లోనే పాటించే కొన్ని పద్ధతులు ఉన్నాయి ఈ సారి వాటినీ అనుసరించి చూడండి. 
 • నిమ్మరసంతో
 • పొట్ట తగ్గాలంటే ముందు కాలేయం మీద ఒత్తిడి ఉండకూడదు. ఎందుకంటే కాలేయంలో వ్యర్థాలు చేరిపోవడం వల్ల అది కొవ్వు జీవక్రియని సరిగా జరపలేదు. దాంతో ఆ కొవ్వంతా చేరి నడుము చుట్టుకొలతను పెంచుతుంది. అందుకని ముందుగా కాలేయంలో వ్యర్థాలు తొలగించుకోవాలి. అందుకు నిమ్మకాయ నీళ్లు మంచి మందు. ఈ నీళ్లు తాగడం వల్ల కాలేయంలో వ్యర్థాల్ని తొలగించే ఎంజైమ్‌లు పెరుగుతాయి. అవి వ్యర్థాలను బయటికి నెట్టేస్తే అప్పుడు కాలేయం చేయాల్సిన పనిని సరిగా చేయగలుగుతుంది.
 • ఉదయం పరగడుపున ఒకగ్లాసు గోరువెచ్చని నీళ్లలో ఒక నిమ్మకాయ రసం పిండుకుని తాగాలి. గోరువెచ్చని నీళ్లలో నిమ్మకాయ కలుపుకోవడం వల్ల కొవ్వు కరిగిపోతుంది. ఇప్పుడున్న వేడికయితే మామూలు నీళ్లే గోరువెచ్చగా ఉంటున్నాయి కాబట్టి వాటిలోనే నిమ్మరసం పిండుకుని తాగొచ్చు. ఇలా చేసినా నిమ్మ వల్ల కలిగే ఫలితంలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ నీళ్లు తాగాక కనీసం 30 నిమిషాలు ఏమి తాగకూడదు, తినకూడదు. ప్రతిరోజూ ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 
 • అల్లం టీ
 • పొట్ట దగ్గర కొవ్వు చేరడానికి అధికంగా తినడం, వయసు వల్ల హార్మోన్లలో కలిగే లోపం, వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి వంటి కారణాలనేకం ఉండొచ్చు. అల్లం ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించగలదు. అలాగే అల్లం కార్టిసోల్‌ ఉత్పత్తిని అణచివేస్తుంది కూడా. కార్టిసోల్‌ అనేది స్టెరాయిడ్‌ హార్మోన్‌. ప్రతిరోజు అల్లం టీ తాగితే పొట్ట దగ్గర ఫ్యాట్‌ కరిపోవడం ఖాయం.
 • కావలసినవి: మంచినీళ్లు - నాలుగు కప్పులు, అల్లం (పొట్టుతీసి, చిన్న ముక్కలు కోసి) - రెండు అంగుళాల ముక్క, నిమ్మకాయ - ఒకటి, తేనె - ఒక టేబుల్‌ స్పూన్‌. 
 • తయారీ: నీళ్లు మరిగించి అల్లం ముక్కల్ని అందులో వేయాలి. సన్నటి మంట మీద పదినిమిషాలు ఉంచి స్టవ్‌ ఆపేయాలి. అల్లం మరిగించిన నీళ్లలో నిమ్మకాయ రసం, తేనె కలపాలి. ఉదయం పూట ఈ అల్లం టీని తాగాలి. జీవక్రియలు క్రమపరిచేందుకు, జీర్ణక్రియ సరిగా జరిగేందుకు, కార్టిసోల్‌ ఉత్పత్తి తగ్గించేందుకు రోజు మొత్తంలో రెండు కప్పుల ఈ అల్లం టీ తాగితే ఫలితం ఉంటుంది.
 • వెల్లుల్లి - నిమ్మలతో
 • వెల్లుల్లి ప్రి-ఫ్యాట్‌ సెల్స్‌ను కొవ్వు కణాలుగా మారకుండా నిరోధిస్తుంది. అందుకని రోజూవారీ ఆహారంలో వెల్లుల్లిని చేర్చడం తప్పనిసరి. పొట్ట దగ్గర చేరిన కొవ్వు కరగాలంటే పచ్చి వెల్లుల్లి తినడానికి మించిన పరిష్కారం మరొకటి లేదు.
 • కావలసినవి: వెల్లుల్లి రెబ్బలు - మూడు, నిమ్మకాయ - ఒకటి, మంచినీళ్లు - ఒక కప్పు. 
 • తయారీ: నీళ్లలో నిమ్మరసాన్ని వేసి బాగా కలపాలి. మూడు వెల్లుల్లి రెబ్బలను నమిలి ఆ తరువాత నిమ్మరసం కలిపిన నీళ్లను తాగాలి. ప్రతిరోజు ఉదయం పరగడుపున ఇలా చేస్తే రెండు వారాల్లో పొట్ట దగ్గరి కొవ్వు తగ్గడం మొదలవుతుంది.
 • ఫ్లాట్‌ బెల్లీ డైట్‌ డ్రింక్‌
 • కావలసినవి: మంచినీళ్లు - రెండు లీటర్లు, కీరదోసకాయ (ముక్కలు కోసి) - మీడియం సైజ్‌ ఒకటి, అల్లం - తురుము అయితే ఒక టీ స్పూన్‌, మెదిపింది అయితే ఒకటి లేదా రెండు అంగుళం ముక్క, నిమ్మకాయ (ముక్కలు) - ఒకటి, పుదీనా - పది లేదా పన్నెండు కొమ్మలు.
 • తయారీ: పైన చెప్పిన వాటన్నింటినీ రాత్రి నీళ్లలో వేసి నానబెట్టాలి. ఈ నీళ్లను రోజంతా తాగుతుండాలి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)