చిరంజీవి చిన్న అల్లుడు హీరోగా రంగం సిద్ధం. చిరు కుటుంబం నుండి ఇతను పదో వ్యక్తి

అగ్ర కథానాయకుడు చిరంజీవి కుటుంబం నుంచి మరో వ్యక్తి నటుడిగా చిత్ర పరిశ్రమలో సందడి చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చిరు చిన్న కుమార్తె శ్రీజ భర్త కల్యాణ్‌ నటుడిగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. నటన అంటే ఆయనకు చాలా ఆసక్తి ఉందట. ఈ నేపథ్యంలో వైజాగ్‌లో శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. కల్యాణ్‌కి శిక్షణ ఇవ్వమని చిరంజీవి ‘స్టార్‌-మేకర్‌’ సత్యానంద్‌ను కలిశారట. పవన్‌కల్యాణ్‌, రవితేజ, మహేశ్‌బాబు, ప్రభాస్‌, వరుణ్‌తేజ్‌, జయం రవి తదితర హీరోలకు సత్యానంద్‌ శిక్షణ ఇచ్చారు.
ఇటీవల కల్యాణ్‌ ఫొటోషూట్‌ అంటూ.. కొన్ని ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టాయి. వీటిని చూసిన నెటిజన్లు నటుడిగాకల్యాణ్‌ బాగుంటారని అంటున్నారు. కల్యాణ్‌ అరంగేట్రం నిజమైతే.. చిరు కుటుంబం నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్న పదో వ్యక్తి కల్యాణ్‌ అవుతారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)