ఒకప్పుడు కేరళ రాష్ట్రంలో ఆడవారి రొమ్ములపై కూడా పన్ను వేసే నికృష్ట ఆచారం ఉండేది ఆ దారుణమైన వివరాలు మీ కోసం

  • ఈ భూమి మీద మనిషి పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు తన ఆధిపత్యాన్ని చూపించటానికి ఎన్నో ప్రయత్నాలు చేసాడు. వాటిలో భాగంగానే కులవ్యవస్థను ప్రవేశపెట్టి అగ్రకులాలు నీచకులాలుగా సమాజాన్ని విడదీసి ఈ సమాజాన్ని మొత్తం తన చేతులలోనికి తీసుకోడానికి అగ్రకులస్తులను మెప్పించి నీచకులాల వారిపై ఆంక్షలు విధించి పైశాచిక ఆనందాన్ని పొందేవారు. ఈ నీచకులాల వారు ఆర్థికంగా, సామాజికంగా కూడా ఎదగకుండా ఉండటానికి అనేక పన్నులు, ఆంక్షలు వారిపై విధించేవారు.
  • పూర్వం కేరళ రాష్ట్రంలోని ట్రావెన్కో సంస్థానం చాలా పెద్ద సంస్థానంగా పేర్కొనబడింది. అయితే నాటి సమాజంలో దళితకులాల వారిపై ఎన్నో ఆంక్షలు, పన్నులు ఉండేవి.
  • అటువంటి పన్నులలో ఒకటి రొమ్ముల పన్ను. ఆడవారిలో సహజంగా వచ్చే రొమ్ములపై కూడా అప్పటివారు పన్నులు వేయటం అనేది ఒక అమానుష చర్యగా పరిగణించాలి.
  • అయితే అప్పటి సమాజంలోని అగ్రవర్ణాల ఆధిపత్యం వల్ల దళితులకు వారి ఆంక్షలను శిరసావహించటం తప్ప వేరే గత్యంతరం వుండేది కాదు.
  • ఈ రొమ్ముల పన్ను ఆధారంగా అప్పటి దళిత స్త్రీలు వారి రొమ్ములను ఎటువంటి వస్త్రంతోనూ మూయకూడదు.
  • ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలోకి వచ్చినప్పుడు వారి రొమ్ములు అందరికీ కనపడాలి. అప్పటి ప్రభుత్వ అధికారులు ప్రతి నెలా ప్రతి దళిత మహిళల యొక్క రొమ్ములను పరిమాణాన్ని దాని బరువును కొలిచి దానికి తగ్గ పన్ను వేసేవారు.
  • ఈ పన్ను వ్యవస్థను 'ముళక్కరం' అనే వారు. ఈ అమానుష చట్టాల వల్ల అప్పటి దళిత మహిళలు మాన ప్రాణాలు గాలిలో దీపాలుగా వుండేవట.
  • చాలా సార్లు పన్ను వసూలు నెపంతో స్వయంగా ప్రభుత్వ అధికారులే ఆ దళిత మహిళల మానాన్ని దోచుకునేవారట.
  • ఈ చర్యల వల్ల అప్పటి దళిత ప్రజలలో అగ్రవర్ణాల వారిపై తీవ్ర ఆగ్రహం వున్నా వారి ధనబలం, అంగబలంతో సరితూగలేక మౌనంగా రోధించేవారట.
  • ఒక వేళ ఎవరైనా తిరగబడితే వారిని రకరకాలుగా హింసించి చంపేసేవారట. ఈ దుర్మార్గాన్ని అప్పట్లో ఒక మహిళా ఎదురుతిరిగి పన్నుకు స్వస్తి పలికేలా చేసింది.
  • అప్పటి ట్రావెన్కోర్ సంస్థానంలోని చర్యల అనే ప్రాంతానికి చెందిన నంగేలి అనే దళిత మహిళా ఈ మూఢాచారంపై తిరుగుబాటు చేసింది.
  • ఆడవారికి సహజంగా వచ్చే రొమ్ములపై,పన్ను వేయటం ఏమిటని మీ అగ్రకులపు స్త్రీల వలె మేము కూడా రొమ్ములు కనిపించకుండా వస్త్రధారణ ఎందుకు చేయకూడదు?అని ప్రశ్నించిందట.ఆమెకు తన భర్త కూడా ఎంతో వెనుదండగా నిలిచేవాడట.
  • ఆ విధంగానే అప్పటి ఈ అసాంఘిక చట్టానికి వ్యతిరేకంగా బహిరంగ ప్రదేశాలలో పూర్తి వస్త్రధారణ తిరగటం, పన్ను కట్టకుండా మొండిగా ప్రయత్నించటం,తోటి దళితులను ఆ విధంగా ఉద్యమించేలా వంటివి చేసేది.
  • నంగేలీని ఎలాగైనా అదుపు చేయాలనే ఉద్దేశ్యంతో అప్పటి పాలకులు నంగేలీతో ఎలాగైనా పన్ను కట్టించదలచి భారీ మందీమార్భలంతో వెళ్లి ఆమె సన్నిహితులనందరినీ బంధించి పన్ను కట్టమని తీవ్ర ఒత్తిడి కలిగించారట.
  • దాంతో నంగేలీ తన రొమ్ములను కోసి వీటి గురించే కదా, మీ తపన. ఈ రక్తపు ముద్దను మీరే తీసుకోండి. అని ఆ అధికారుల ముఖంపైకి విసిరికొట్టిందట.
  • ఆమె చర్యకు ఆశ్చర్యపోయిన ఆ అధికారులు, భయంతో అక్కడినుండి పరుగుతీయగా ఆమె తీవ్ర రక్త స్రావంతో మరణించింది.
  • ఆమె భర్త తన భార్య మరణించటం జీర్ణించుకోలేక ఆమె చితిమంటలపై పడి తానూ మరణించాడట.వారి చితిమంటలు అక్కడి దళితుల గుండెలలో ఆగ్రహజ్వాలలుగా మారి ఒక ఉద్యమానికి దారితీసింది.
  • ఒక్కొక్క గడ్డిపూచ కలిసి ఒక ఏనుగును సైతం బంధించగలదు అనే సామెతను నిజం చేస్తూ అప్పటి అన్ని ప్రాంతాలలోని దళిత ప్రజలు ఏక తాటి పై నిలిచి ముక్తకంఠంతో ఈ అమానుష చట్టంపై తిరుగుబాటు చేశారు.
  • వారి అకుంఠిత దీక్ష,అలుపెరుగని పోరాటం వల్ల అప్పటి పాలకులు, అగ్రవర్ణాల వారు దిగి రాక తప్పలేదు.
  • నంగేలి దళిత ప్రజలలో రేపిన వుద్యమజ్వాల ఒక నవసమాజ స్థాపనకు నాంది అయిందని ఇప్పటికీ కేరళ రాజ్యంలో కథలుకథలుగా చెప్పుకుంటున్నారు.

Popular Posts

Latest Posts