మనం తీసుకునే ఆహారంలో పులుపు కచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే శరీరాన్ని నడిపించేది పులుపే కాబట్టి

  • మనం తీసుకునే ఆహారంలో కాసింత పులుపు కూడా ఉండాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చింత పండు, నిమ్మ‌, ఉసిరి, నారింజ పండ్లను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పులుపు తీసుకోవడం ద్వారా నోటిలో లాలాజలం ఎక్కువగా ఊరుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అయితే పులుపు ఎక్కువగా మాత్రం తీసుకోకూడదు. మితంగా తీసుకోవాలి. 
  • అలా ఎక్కువగా తీసుకుంటే కఫ, వాత, పిత్త దోషాలు కలుగుతాయి. దృష్టి మందగిస్తుంది. శరీరం అనారోగ్యం పాలవుతుంది. ఆహారాన్ని అధికంగా జీర్ణ పరుస్తుంది. కాళ్ళు, చేతులు నీరు పడతాయి. దాహం ఎక్కువ అవుతుంది. ఎనీమియా, చర్మ వ్యాధులు, తలతిరగడం, దురదలు కలుగుతాయి. అయితే ఆమ్లా, నారింజ, బత్తాయి పండ్లను రోజుకొకటి చొప్పున తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
  • ప్రకృతిలో మనిషికి విటమిన్ సీ అత్యంత కీలకం ఇది మనం తీసుకునే పులుపులోనే ఎక్కువగా లభిస్తుంది. ఆస్కార్బిక్ యాసిడ్ గా పిలవబడే ఈ విటమిన్ శరీర సమతాస్థితిని కాపాడుతుంది. రోగనిరోధక వ్యవస్థ సమతుల్యతను కాపాడుతుంది. ఐరన్ శరీరంలోకి ఎక్కువగా తీసుకునేలా చేస్తుంది. సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లతో శరీరానికి బూస్ట్ అందిస్తుంది. చర్మం నిగనిగలాడేందుకు దోహదపడుతుంది. వెంట్రుకలు సమృద్ధిగా ఉండేట్లు కాపాడుతుంది. శరీరం గ్లో పెరిగేందుకు కారణమవుతుంది. అందుకే విటమిన్ సీ ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. ఇది రోజువారీ ఆహారంలో పులుపు రూపంలో ఉండే విటమిన్ సీ ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది తగినంత శరీరానికి అందితే రోగాలు దూరమవుతాయన్నది నిజం.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)