ప్రిన్స్ నన్ను టైంపాస్‌ కు వాడుకున్నారు. ధన్ రాజ్ ప్రవర్తన సరిగ్గా లేదు

  • తెలుగు టెలివిజన్ రంగంలో ఎక్కువ రేటింగ్ వస్తున్న కార్యక్రమం బిగ్‌బాస్ రియాల్టీ షో. 70 రోజుల ఈ రియాలిటీ షో చివరి దశకు చేరింది. ఇటీవల బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన కంటెస్టంట్ దీక్షా పంత్ ఓ టెలివిజన్ ఛానల్‌తో మాట్లాడింది. ఆ సందర్భంగా ఇంటి సభ్యుల ప్రవర్తన గురించి చెబుతూ దీక్ష కన్నీటి పర్యంతమైంది. బిగ్‌బాస్ హౌస్‌లో సభ్యుడు ప్రిన్స్ నన్ను టైంపాస్‌ కు వాడుకున్నారు. నన్ను ముగ్గులోకి లాగడానికి పయత్నిస్తున్నట్టు గుర్తించాను. కానీ నేను ఎప్పుడూ దానిని సీరియస్‌గా తీసుకోలేదు. ఆయన టైంపాస్‌కు నన్ను వాడుకుంటున్నట్టు ముందే తెలుసు. నేను సీరియస్‌గా తీసుకోలేదు.. అని చెప్పుకొచ్చింది. దీక్ష ఈ ఇంటర్వ్యూలో ఏమన్నదంటే..
  • నేను టైంపాస్‌కు ప్రిన్స్ ని వాడుకోలేదు. ఇంటి సభ్యులందరితో ఎలా ఉండే దానినో అలానే ఉన్నాను. నేను ఏమి చేయలేదు. నేను పెద్దగా పట్టించుకోలేదు. ప్రిన్స్ బిహేవియర్‌ను సీరియస్‌గా తీసుకోలేదు. అంతేకాకుండా తనతో చెడుగా ప్రవర్తించిన ధన్‌రాజ్, అర్చన తదితరుల గురించి తీవ్ర విమర్శలు చేసింది. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన సభ్యులందరూ అక్కడ తాము గడిపిన మధుర క్షణాల గురించి ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. వివాదాలకు తావీయకుండా ఆచితూచి జవాబిచ్చారు.
  • దీక్ష ధన్ రాజ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. షోలో అతను తనతో మొదట నుంచి వ్యతిరేకంగా ఉండడానికి బలమైన కారణం ఉందంటూ కుండబద్దలు కొట్టింది. ఆ ఇంటర్వ్యూలో దీక్ష ఇలా చెప్పుకొచ్చింది.. బంతిపూల జానకి చిత్రం చేస్తున్న సమయంలో ధన్ రాజ్ ప్రవర్తన సరిగ్గా లేదు. అందుకే నేను బిగ్ బాస్ హౌస్ లోనూ అతడితో దూరంగానే ఉన్నాను. ధన్‌రాజ్‌కు దూరంగా ఉన్న కారణంగానే బిగ్‌బాస్ షోలో అతను నాకు వ్యతిరేకంగా ఉన్నాడు. నా గురించి తెలియని వాళ్లు విమర్శిస్తే పర్లేదు. కానీ నా గురించి తెలిసిన ధన్ రాజ్ కూడా నన్ను విమర్శించడం నాకు చాలా బాధేసింది. నేను హౌస్ లోకి వెళ్లిన ఫస్ట్ డే నుంచి అతను నాకు వ్యతిరేకంగా ఉండటం నాకు నచ్చలేదు.
  • ‘నిజానికి … మా ఇద్దరి మధ్య సినిమా వరకే మంచి రిలేషన్ ఉంది. బయట మేమిద్దరం ఎప్పుడూ కలవలేదు. ధన్ రాజ్ చాలా సార్లు బయట కలుద్దామని అడిగాడు. తన రూమ్ కి రమ్మని అడిగాడు. అందుకు నేను ఒప్పుకోలేదు. నాకలా కలవడం ఇష్టం లేదు. బహుశా అదే మనుస్సులో పెట్టుకుని బిగ్ బాస్ హౌస్ లో ధన్ రాజ్ అలా ప్రవర్తించాడేమో అనిపించింది’ అని చెప్పుకొచ్చింది. ఈ విధంగా దీక్ష చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)