మన చేతి గోర్ల‌ను బట్టి మనలో ఉన్న అనారోగ్యాన్ని చాలా ఈజీ గా కనిపెట్టచ్చు

  • చేతి గోర్లు ఒక్కొకరికి ఒక్కోలా ఉంటాయి. ఇద్దరు వ్యక్తుల గోర్లు ఒకేలా ఉండటం చాలా అరుదు. మన చేతి గోర్ల‌ను బట్టి మనలో ఏదైనా లోపం ఉందో లేదో ఇట్టే కనిపెట్టచ్చు అంటున్నారు కొందరు నిపుణులు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 
  • కొందరికి చేతి వేలి గోర్ల‌పై అర్ధ‌చంద్రాకారంలో (semi circle) నెల‌వంక‌ను పోలిన ఓ ఆకారం ఉంటుంది. ఈ ఆకారాన్ని లునులా (Lunula) అంటారు. లునులా అంటే లాటిన్ భాష‌లో స్మాల్ మూన్ అని అర్థం.... అంటే నెలవంక లేదా చంద్రవంక అని అర్ధం. ఎప్పుడోకప్పుడు ఈ ఆకారాన్ని మీరు గమనించే ఉంటారు. కానీ దాని గురించి ఎక్కువగా పట్టించుకొని ఉండరు... అంతేనా? మన శరీరంలో అత్యంత సున్నితమైన భాగాల్లో ఈ లునులా ఒక‌టి. ఈ లునులా దెబ్బ‌తింటే మాత్రం ఆ గోరు ఇక పెరగడం ఆగిపోతుందట. రంగును బ‌ట్టి మ‌నం ఎదుర్కొంటున్న ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా సుల‌భంగా తెలుసుకోవచ్చ‌ట‌. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
  • చేతి గొర్లపై లునులా అస‌లు లేక‌పోతే... వారిలో రక్త‌హీన‌త‌, పౌష్టికాహార లోపం లాంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నార‌ని అర్ధం. 
  • ఒక‌వేళ లునులా రంగు నీలం లేదా పూర్తిగా తెలుపులో పాలి పోయి ఉంటే వారికి డ‌యాబెటిస్ ఉందని లేదా త్వరలో రాబోతుంద‌ని అర్థం చేసుకోవాలి. 
  • లునులా మీద ఎరుపు లేదా పసుపు రంగులో మ‌చ్చ‌లు ఉంటే వారికి గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్నాయ‌ని తెలుస్తుంది. 
  • లునులా ఆకారం మ‌రీ చిన్న‌గా, గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా ఉంటే వారు అజీర్ణంతో బాధ‌ప‌డుతున్నార‌ని, వారి శ‌రీరంలో విష, వ్య‌ర్థ పదార్థాలు ఎక్కువ‌గా పేరుకుపోయాయ‌ని తెలుసుకోవాలి. 
  • ఇది గమనించి మీ శరీరానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.... ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని అంటున్నారు నిపుణులు. మరి మీరు కూడా మీ చేతి గొర్లను ఒక్కసారి గమనించండి. అలాగే ఈ ఆర్టికల్ ని షేర్ చేయండి మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ వార్తను అందజేయండి. తగిన జాగ్రత్తలు తీసుకోండి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)