రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదా ఈ చిట్కాలు పాటించి రాత్రంతా హాయిగా నిద్రపోండి

రాత్రి నిద్రపట్టక ఇబ్బంది పడేవాళ్లు చాలా మందే ఉన్నారు. అలాంటి వాళ్లు కొన్ని చిట్కాలు పాటించి హాయిగా రాత్రంతా నిద్రపోవచ్చంటున్నారు నిపుణులు. మరి, ఆ చిట్కాలేమిటో మనమూ తెలుసుకుందామా!
  • రాత్రి నిద్రపట్టడం కష్టంగా ఉండేవాళ్లు పగటిపూట పడుకోకపోవడమే మంచిది. ముఖ్యంగా మధ్యాహ్నం మూడు దాటాక అస్సలు నిద్రపోకూడదు. సాయంత్రం ఐదు తర్వాత కాఫీ, టీ, చాక్లెట్లు, శీతల పానీయాల్లాంటి కెఫీన్‌ ఉన్న పదార్థాలు తినకుండా ఉంటే మంచిది.
  • రాత్రి భోజనానికి, నిద్రకీ మధ్య కనీసం మూడు గంటల సమయం ఉండేట్లు చూసుకోవాలి. రాత్రిపూట మరీ ఎక్కువ కాకుండా మధ్యాహ్నం తిన్నదాంట్లో సగం తింటే చాలు. దాంతో శరీరం తేలిగ్గా ఉంటుంది. 
  • కొన్ని అధ్యయనాల ప్రకారం ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి పడుకున్న పదిహేను నిమిషాల్లో నిద్రలోకి జారుకుంటారు. అలా కాకుండా ఎక్కువ సమయం పడుతుంటే మీరు ఏదో ఆలోచిస్తున్నారనో, ఆందోళనలో ఉన్నారనో అర్ధం. కాబట్టి నిద్రపోవడానికి ముందు చికాకు, ఆందోళన కలిగించే విషయాలు మాట్లాడకూడదు. వీలైనంత ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. పుస్తకం చదవడం, పాటలు వినడం, గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం వంటివి మనసుకీ, శరీరానికీ హాయి కలిగిస్తాయి. 
  • ఫోన్లను దూరంగా పెట్టేయాలి. వాటి నుంచి వచ్చే రేడియేషన్‌ కూడా నిద్ర పట్టకపో వడానికి కారణం అవుతుంది. అంతేకాదు, కళ్లపై వెలుతురు పడకుండా చూసుకోవాలి. చీకట్లో నిద్ర కలిగించే హార్మోన్లు బాగా పనిచేస్తాయి. వీలైనంత వరకు రోజూ ఒకే సమయానికి పడుకోవడం, లేవడం చేయాలి. ఈ క్రమం తప్పినా కొన్నిసార్లు నిద్ర దూరం అవుతుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)