నిమ్మకాయ మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదండోయ్ ఆరోగ్యానికి, అందానికి నిమ్మకాయ చిట్కాలు మీ కోసం


  • నిమ్మకాయ పేరు చెప్పగానే నోట్లో నీళ్లు తిరుగుతాయి కదూ..! రుచికి మాత్రం పుల్లగా ఉన్నా ఇది మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదండోయ్. మన శరీరానికి ఒక రోజు మొత్తానికి కావాల్సిన సి-విటమిన్‌ను నిమ్మ అందిస్తుంది. అలాంటి నిమ్మ గురించి ఆరోగ్యానికి, అందానికి సంబంధించిన కొన్ని చిట్కాలు తెలుసుకుందామా...!
  • నిమ్మరసాన్ని చెంచాలో తీసుకొని దానిలో కాసింత ఉప్పుని కలిపి తాగితే వికారం తగ్గుతుంది. 
  • అధిక బరువుతో బాదపడేవాళ్లు పరగడుపున నిమ్మరసం, తేనె కలిపి అందులో కొద్దిగా నీళ్లు కలుపుకుని ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ తాగుతుంటే శరీరం బరువు తగ్గుముఖం పడుతుంది. 
  • నిమ్మరసం తాగినా... నిమ్మతో చేసిన ఆహారపదార్థాలు తిన్నా... చాలాసేపటి వరకు ఆకలిగా అనిపించదు. 
  • తలస్నానం చేసే ముందు నిమ్మరసం కలిపిన నీటితో స్నానం చేస్తే కురులు నల్లగా మెరుస్తాయి. 
  • ముల్తానా మట్టిలో నిమ్మరసాన్ని కలిపి మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరాక కడిగిస్తే ముఖం నిగనిగలాడుతుంది.
  • నిమ్మరసానికి జిడ్డు తొలగించే స్వభావం ఎక్కువ కాబట్టి నిమ్మరసాన్ని ముఖానికి పట్టించి ఐదు నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగితే ముఖంమీద జిడ్డు తొలగి ఎల్లప్పుడూ తాజాగా ఉంటుంది.
  • ఎండబెట్టిన నిమ్మను మెత్తని పొడిగా చేసుకొని సున్నిపిండితో కలిపి స్నానం చేస్తే చర్మంమీది మృతకణాలన్నీ తొలగిపోతాయి.
  • నిమ్మరసాన్ని పెరుగులో కలిపిన మిశ్రమాన్ని చర్మానికి పట్టించి స్నానం చేస్తే మేనిఛాయ పెరుగుతుంది. 
  • కంటికింద ఉన్న నల్లటి వలయాలు తగ్గాలంటే దూదితో నిమ్మరసాన్ని అద్ది మునివేళ్లతో సున్నితంగా మర్ధనచేయాలి. వారం పాటు ఇలాచేస్తే కళ్లచుట్టూ కనిపించే నల్లని వలయాలు నెమ్మదిగా కనుమరుగవుతాయి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)