వేసవికాలం కదా అని ఏసీని తెగ వాడేస్తున్నారా..? ప్రాణాలు పోతాయ్..! ఎందుకో ఒకసారి ఇది చదవండి

వేసవికాలం కదా అని ఏసీని తెగ వాడేస్తున్నారా....? బయట వేడి ఎక్కువగా ఉంది కదా అని ఏసీ కూలింగ్ రేంజ్ పెంచేస్తున్నారా..? ఎండకు భయపడి ఏసీ కోసం ఆఫీసుల్లో ఎక్కువ సేపు గడిపేస్తున్నారా..? అయితే మీరు ప్రమాదం అంచున ఉన్నట్లే. అది అలాంటిలాంటి ప్రమాదం కాదు.. చావుకు కూడా దగ్గర చేర్చే ప్రమాదం. ఇటీవల ఆసుపత్రుల్లో వడదెబ్బ కారణంగా వచ్చే రోగుల వివరాలను పరిశోధించిన మీదట వైద్యులు ఈ ఆసక్తికరమయిన వివరాలను వెల్లడించారు.

బయటి వాతావరణం కంటే 20డిగ్రీల తేడాతో ఏసీలో గడుపుతున్నారనీ, దాన్నుంచి ఒక్కసారిగా బయటకు వస్తే ఆరోగ్య విషయంలో చాలా విపత్కర పరిణామాలు జరుగుతున్నాయని వైద్యులు వెల్లడించారు. ఎక్కువ సేపు ఏసీలో ఉండటం వల్ల ఆ వాతావరణానికి శరీరం అలవాటు పడిపోతుందని, ఒక్కసారిగా ఆ వాతావరణం నుంచి బయటకు వస్తే వడదెబ్బ బారిన పడతారన్నారు. స్పృహ తప్పి పడిపోవడం, తలనొప్పి, వాంతులు చేసుకోవడం వంటి వాటితోపాటు చర్మ సంబంధిత సమస్యలు చుట్టుముట్టే ప్రమాదముందన్నారు. ఇవి చిన్న సమస్యలుగానే కనిపిస్తున్నా.. కొన్ని సమయాల్లో ఇది మరణానికి కూడా దారితీయవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఏసీ గదుల్లో పనిచేస్తున్న వారు కూడా వడదెబ్బ బారిన పడటాన్ని వారు ఉదాహరణగా చెబుతున్నారు. రోజుకు కనీసం అయిదుగురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఈ సమస్యతో తమను సంప్రదిస్తున్నట్లు నగరంలోని ప్రముఖ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

Popular Posts

Latest Posts