
ఆహార అలవాట్లు సరిగా లేకపోవడం, శారీరక శ్రమ సరిగా ఉండకపోవడమే ఇందుకు కారణమని పరిశోధకులు భావిస్తున్నారు. లావుగా ఉన్న మహిళలు తమ భర్తల ఆహార అలవాట్లు, ఇతర కార్యకలాపాలను ప్రభావితం చేస్తున్నారు. భర్తల జీవనశైలిపై భార్యల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఈ పరిశోధన తేల్చింది. ఆహారం వండే బాధ్యత ఆడవాళ్లపై ఉండటం లేదంటే వారు తమ గురించి అధికంగా శ్రద్ధ వహిస్తుండటమే ఇందుకు కారణం కావచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
ఆర్హస్ యూనివర్సిటీకి చెందిన ఆడమ్ హల్మన్ ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు. పోర్చుగల్లో జరిగిన యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ వార్షిక సమావేశంలో ఈ ఫలితాలను వెల్లడించారు.
Loading...