ఏం తిన్న ఎంత తిన్న ఎన్ని సార్లు తిన్న ఈ సమయంలో మాత్రమే తినండి.. నెల రోజుల్లో బరువు తగ్గి సన్నబడతారు

బరువు తగ్గడానికి, సన్నబడటానికి సంబంధించి ఇటీవలి కాలంలో ఓ పద్ధతి ప్రచారంలోకి వచ్చింది. ఏం తిన్నా ఎనిమిది గంటల మధ్యలోనే తినాలి. ఉదాహరణకు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల లోపుగానే తినాలి. రెండుసార్లు తిన్నా, నాలుగుసార్లు తిన్నా 12 నుంచి 8 గంటల మధ్యనే తినాలి. రాత్రి 8 గంటలకు డిన్నర్‌ పూర్తి చేశాక, మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ఏం తినకూడదు. దాహమేస్తే మంచినీళ్ళు మాత్రమే తాగాలి. అంతే తప్ప టీలు, కాఫీలు సేవించ కూడదు. ఆహారం తీసుకోవాల్సిన ఎనిమిది గంటల సమయంలో తమకు నచ్చిన ఆహారం తీసుకోవచ్చు.
ఈ పద్ధతిని అమలు చేస్తే సన్నబడటం, దృఢంగా తయారు కావటం సాధ్యమేనని అధ్యయనాలు చెబు తున్నాయి. తెలుగువారిలోనూ కొందరు సెలబ్రిటీలు బరువు తగ్గాలనుకునేవారు అనుసరిస్తున్నారు. అయితే డయాబెటిక్‌తో బాధపడేవారు, ఇతరత్రా దీర్ఘకాలిక జబ్బులున్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే ఈ పద్ధతిని అనుసరించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇతరులు మాత్రం ఈ పద్ధతిని అనుసరించి బరువు తగ్గడానికి, సన్నబడి చూడచక్కగా కనబడటానికి అవకాశముందని చెబుతున్నారు. ఏం తిన్నా, తాగినా ఆ ఎనిమిది గంటల మధ్యనే అనే సూత్రానికి కట్టుబడి వరుసగా ముప్పయి రోజులు పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)