ATM రిసిప్ట్ పారేస్తున్నారా? ఇది చదివాకా ఇంకెప్పుడు అలా చేయరు

ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్… అదేనండి ATM. మన జీవితాల్లోకి ATM వచ్చాక బ్యాంకు లావాదేవీలు ఎంతో వేగంగా, సులభంగా జరిగిపోతున్నాయి. పెద్ద పెద్ద లైన్లలో… గంటలకొద్ది ఎదురు చూడకుండా క్షణాల్లో మన డబ్బున్ని ATM ద్వారా డ్రా చేయచ్చన్న విషయం అందరికి తెలిసిందే. కాని ఇలా ATM లో డబ్బు డ్రా చేస్తున్నప్పుడల్లా మీరు ఒక తప్పు చేస్తున్నారని గుర్తించండి. డబ్బు డ్రా చేయగానే.. ATM మనకి ఓ రసీదు ఇస్తుంది. దీంట్లో ఎన్నో విషయాలు ఉంటాయి. మనం ఎంత డ్రా చేసాం… మన ఎకౌంటులో ఇంకా ఎంత డబ్బు ఉంది… లాంటి ఎన్నో విషయాలు ఇందులో ఉంటాయి.

ఇన్ని వివరాలు ఉన్న రిసిప్ట్ ని… ఏదో చెత్త కాగితంలా పారేస్తుంటారు. మనకెందుకులే అని మీరు పారేసిన రిసిప్ట్ మీ పాలిట శాపంగా మారే అవకాశాలు ఉన్నాయి. మీ ATM రిసిప్ట్ ద్వారా సైబర్ క్రైమ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రిసిప్ట్ ముఖ్యంగా హ్యాకర్స్ కు మీ ఎకౌంట్ ను యాక్సెస్ చేసే ఆయుధంగా మారుతుంది. రిసిప్ట్ లో ఉన్న వివరాలతో మీ డీటెయిల్స్ ని డీకోడ్ చేసి మీ ఎకౌంట్ ని దుర్వినియోగం చేసే అవకాశాలు అధికమవుతాయి.

మీ ఎకౌంటు నుండి వేరే ఎవరైనా డబ్బును డ్రా చేస్తున్నారేమో తెలుసుకోవచ్చు. బ్యాంకుకు వెళ్ళే అవసరం లేకుండా ATM లో లభించే మినీ స్టేట్మెంట్ ద్వారా ఈ వివరాలను తెలుసుకోవచ్చు. ATM నుండి డబ్బు డ్రా చేసేటప్పుడు ఏదైనా టెక్నికల్ లోపం తలెత్తితే.. ATM రిసిప్ట్ పూఫ్ లా ఉపయోగపడుతుంది. ఇలాంటి సందర్భాలలో బ్యాంకు వారు ట్రాన్-సాక్షన్ నెంబర్ ను అడుగుతారు. ఈ నెంబర్ కేవలం ATM రిసిప్ట్ పైనే ఉంటుంది. ఈ నెంబర్ లేనిదే మీ కంప్లైంట్ చెల్లదు.

ATM రిసిప్ట్ ద్వారా దొంగతనాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు పారేసిన రిసిప్ట్ లో మీ ఎకౌంటు లో ఇంకా ఎంత డబ్బుందో తెలుస్తుంది. ఇలా చేస్తే… పిలిచి మరీ దొంగ చేతిలో తాళాలు పెట్టినట్టే..!! దొంగలు ఈ వివరాలను సేకరించి… ఇంకెప్పుడైనా మీరు ATM కి వచ్చినప్పుడు… మిమ్మల్ని బెదిరించి బలవంతంగా ఎక్కువ మొత్తం డ్రా చేయమనే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల.. ఇంకెప్పుడైనా ATM రిసిప్ట్ పారేయడం వంటివి చేయకండి..!! మీరు దీన్ని చింపి పారేసినా ప్రయోజనం ఉండదు. వీటిని భద్రంగా మీ వద్దనే ఉంచుకోవడం ఉత్తమం. కుదరకపోతే… ATM మెషిన్ రిసిప్ట్ కావాలా అని అడిగినప్పుడు NO అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి.

ఈ విలువైన సమాచారాన్ని షేర్ చేయడం మరువకండి. మీ బంధుమిత్రులను ఇలాంటి మోసాలా నుండి కాపాడండి..!!
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)