తెల్లగా ఎర్రగా ఉండే అబ్బాయిలనే ఇష్టపడతారా అని అడిగితే మన అమ్మాయిలు ఏమని సమాదానం ఇచ్చారంటే

మన భారతీయులకి ఈ తెల్ల తోలు పిచ్చి ఎందుకు మొదలైందో, ఎలా మొదలైందో కానీ తెల్లగా ఉండటమే అందం అనుకుంటారు. తెల్లగా ఉండేవారు హీరోయిన్లు అవుతారు. తెల్లగా ఉంటేనే గ్లామరస్ గా ఉన్నట్లు అంటారు. పెళ్ళికి అమ్మాయి కావాలంటే ఎర్రగా ఉండే అమ్మాయే కావాలి అంటారు. కేవలం మాంసానికి ఓ కవర్ లా ఉండే చర్మం రంగుపై ఎందుకు ఇంత మక్కువ ? ఎందుకు ఇంత పిచ్చి ? అబ్బాయిలకి (చాలామందికి) ఈ తెల్ల/ఎర్ర తోలు పిచ్చి ఉంది అనేది సుస్పష్టం. మరి అమ్మాయిల సంగతి ఏంటి ? తెల్లగా/ఎర్రగా ఉండే అబ్బాయిలే కావాలా వారికి ? ఓ లైఫ్ స్టయిల్ ఛానెల్ కి వారు ఇచ్చిన సమాధానాలు ఇలా ఉన్నాయి.
శిరీష చౌదరి, హైదరాబాద్ :
“అమ్మాయిలు రంగు విషయంలో మరీ అంత సెలెక్టివ్ గా ఉంటారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే మనదేశంలో అబ్బాయి నల్లగా, అమ్మాయి తెల్లగా ఉన్న జంటలను ఎన్ని చూడట్లేదు ? పెళ్ళి సంబంధాలు చూసేటప్పుడు తెల్లగా ఉండే అబ్బాయే కావాలి అని మొండికేసే అమ్మాయిని నేనైతే చూడలేదు ఇప్పటివరకు”
రమ్య, విశాఖపట్నం :
“లేదండి .. అమ్మాయిలు మరి అంత చెత్తగా ఆలోచించలేరు. చర్మం రంగుని బట్టి భాగస్వామిని ఎంచుకోవడం అనేది చాల స్టుపిడ్ ఐడియా. కాని ఈ ప్రెషర్ అమ్మాయిల మీద ఉంటుంది. అమ్మాయి నల్లగా ఉంటే తనకి అంత త్వరగా సంబంధాలు రావు. కాని పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే మార్పులు వస్తున్నట్టు కనిపిస్తున్నాయి. డస్కిగా ఉండే అమ్మాయిలపై మోజుపడుతున్నారు అబ్బాయిలు”
ఎస్తేర్ రాణి , వరంగల్ :
“నేను హాలివుడ్ నటుడు విల్ స్మిత్ కి వీరాభిమానిని. నా సమాధానాన్ని ఇంతకన్నా బాగా చెప్పలేను ఏమో. కాని నల్లగా ఉండే హీరోయిన్ కి నేను ఫ్యాన్ అని చెప్పుకునే అబ్బాయిని నేను ఇప్పటివరకు చూడలేదు. అయినా అబ్బాయిలది తప్పు కాదు. తెల్లగా ఉండేవారినే హీరోయిన్లుగా తీసుకుంటారు సినిమా వారు. అలా ఉంటేనే గ్లామర్ అన్నట్లు అలవాటు చేసారు. అందుకే ఇలా తయారవుతున్నారు జనాలు”
స్రవంతి , విజయవాడ :
" ఫెయిర్ నెస్ క్రీములు ఎక్కువ వాడే దేశం మనది. ఎంతకాదన్నా రంగు పిచ్చి ఎక్కువే మనవారికి. అబ్బాయి ఛామనఛాయలో ఉంటే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నచ్చితే నల్లగా ఉన్నా ఫర్వాలేదు. ఎర్రగాబుర్రగా ఉండే అబ్బాయి పట్ల కొంచెం ఆకర్షణ పెంచుకోవడం సహజమే కాని నల్లగా ఉంటే చులకనగా చూడను”.
జైరా ఖాన్ , హైదరాబాద్ :
“మరీ తెల్లగా ఉంటే కూడా ఏం బాగుంటారు. కొంచెం రంగు తక్కువగా ఉంటేనే సెక్సీగా అనిపిస్తారు అబ్బాయిలు. డస్కిగా ఉండి, కండల దేహం ఉంటే ఆ కాంబినేషన్ వేరు. సూపర్ సెక్సీగా ఉంటారు అలా అబ్బాయిలు. కాబట్టి అమ్మాయిలవరకైతే రంగు పెద్ద మ్యాటర్ కాదేమో”
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)