పిల్లల్లో,పెద్దల్లో నులిపురుగులు శాశ్వతంగా ఎలా నివారించాలంటే

పిల్లల పొట్టలో తిష్టవేసి పోషకాలను ఆరగిస్తూ ఆరోగ్యాన్ని హరించేవి నులిపురుగులు. ఈ నులిపురుగుల పై నిర్లక్షం తగదు అంటున్నారు వైద్యులు. వీటి గురుంచి ముందు జాగ్రతలు తీసుకోకపోతే ప్రాణాలకే ముప్పు రావొచ్చట. చిన్నారులు బయట ఆడుకొని వచ్చి చేతులు కడుక్కోకుండా అలాగే భోజనం చూస్తే నోటిద్వారా రకరకాల పురుగుల లార్వాలు లొపలికి వెల్లి ప్రేగుల్లోకి ప్రవేశించి అక్కడే తిష్ట వేస్తాయి. ఇవి ముఖ్యంగా 19 ఏళ్ల లోపు పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. తినే ఆహారం ప్రేగుల్లోకి చేరినప్పుడు రక్తంలోకి చేరాల్సిన పోషకాలను నులిపురుగులు పీల్చుకోవడంతో చిన్నారుల్లో ఎదుగుదల నిలిచిపోతుంది. దీంతో వివిధ రోగాల భారిన పడుతారు.
  • వీటిని నివారించాలంటే ముఖ్యంగా గోర్లను కట్ చేసుకుని చేతులను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.
  • స్వచ్ఛమైన నీటినే త్రాగాలి పండ్లు కూరగాయలను స్వచ్చమైన నీటితోనే కడగాలి. 
  • బహిరంగ ప్రదేశంలో మలవిసర్జన చేయకూడదు మలవిసర్జన చేసిన వెంటనే చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కొవాలి. 
  • పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. కాళ్లకు చెప్పులు వేసుకొవాలి ఇలాంటి జాగ్రత్తలను పాటిస్తూ ఇంట్లో సహజసిద్దమైన పద్దతిలో కొన్ని చిట్కాలను పాటిస్తుంటే వీటిని నివారించుకొవచ్చు.
  • ఉల్లిపాయ రసాన్ని ఉదయం పరగడుపున పిల్లలకు ఇవ్వడం వలన ఈ నులిపురుగులు చనిపోతాయి.
  • దానిమ్మ గింజలను గానీ దానిమ్మ రసం గానీ తీసుకొవడం వలన పొట్టను క్లీన్ మరియు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. 
  • అలాగే కారెట్ జ్యూస్ ను తాగడం వీటిలోని యాంటి ఆక్సిడెంట్ లు రక్తకణాలను శుద్దిచేసి పరాన్న జీవులను నిర్మూలించి రక్తాన్ని పెంచుతుంది. జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్స్ కూడ ఎక్కువగా ఉంటాయి. 
  • ఈ చిట్కాలను పాటించి పైన చెప్పిన జాగ్రతలు పాటించటం వలన నులిపురుగులు రాకుండా ఆరోగ్యాన్ని జాగ్రతగా కాపాడుకోవచ్చు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)