ఇండియాలో అసహనం, అభద్రత గురించి మాట్లాడేవారు కచ్చితంగా ఉత్తర కొరియా గురించి తెలుసుకోవాలి

చాలామంది అత్యంత సెక్యూర్డ్ గా బతుకుతూనే, ఈ తిండి తింటూనే మన దేశాన్ని తిట్టుకుంటూ ఉంటారు. దిక్కుమాలిన దేశం అంటుంటారు. వందల కోట్లు ఈ ప్రజల బలహీనతతో సంపాదించుకున్న ఎదవ సెలబ్రిటీలు కూడా ఈ దేశంలో నా బిడ్డలు ఎలా బతుకుతారు ? అని ప్రశ్నిస్తారు. ఇక్కడి ధర్మాన్ని అసహ్యించుకుంటారు. ఇక్కడి ప్రజల్ని ద్వేషిస్తారు. ఇక్కడి ప్రజాస్వామ్యాన్ని తూలనాడతారు. ఇక్కడి సంస్కృతిలో భాగమైన ఓర్పును, సహనాన్ని కూడా అర్థం చేసుకోలేక ఈసడించుకుంటారు. అంతర్యుద్ధాలతో రోజూ చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న దేశాల్లో పడేస్తే తెలుస్తుంది ? వేరే దేశపు క్రీడాకారుడిని మెచ్చుకుంటేనే దేశద్రోహం కేసు పెట్టిన దేశంలో పడేస్తే తెలుస్తుంది ? పక్కా నియంతృత్వంలో కనీస పౌరహక్కులూ లేని దేశాల్లో పడేస్తే తెలుస్తుంది. మితిమీరిన స్వేచ్ఛ అనుభవిస్తున్నాం కదా. ఇండియాలో అభద్రత గురించి మాట్లాడేవారు కచ్చితంగా ఉత్తర కొరియా గురించి తెలుసుకోవాలి. అక్కడ పాలన ఏమిటో, ఎందుకు విశ్వంలోకెల్లా ఓ నికృష్ట జీవనం గడుపుతున్నారో తెలుసుకోవాలి. కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుందాం… తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది…

ఉత్తర కొరియా నియంత… కిమ్ జోంగ్ ఉన్… వారసత్వంగా కుర్చీ ఎక్కిన ఓ సైకో… తనకు జస్ట్, అనుమానమొస్తే చాలు ఎంత పెద్ద సైన్యాధికారినైనా ఖతం చేయించేస్తాడు… తన దగ్గర బంధువులను కూడా హతమారుస్తాడు… మంత్రులు, సైన్యం, మేధావులు, కోర్టులు, కాలేజీలు…. తను ఏది చెబితే అదే రాజ్యాంగం… దేశాన్ని అక్షరాలా భయం, అరాచకం పాలిస్తున్నాయి… మన దేశంలో మందలాగా ఒలింపిక్స్ కు తరలివెళ్లిన అనేకమంది క్రీడాకారులు అక్కడ తుస్సుమని, సైలెంటుగా ఇక్కడికొచ్చేసి, తమ పనులు తాము చేసుకుంటున్నారు కదా… ఉత్తర కొరియాలో అంత ఈజీ కాదు… రియో ఒలింపిక్స్ కు వెళ్లేముందే చెప్పాడు… కనీసం 5 గోల్డ్ మెడల్స్ రావాలి, మన పాత చరిత్రను బట్టి కనీసం 17 పతకాలు రావాల్సిందే అన్నాడు… పాపం, ఆ టార్గెట్ చేసే వణుకు పుట్టిందేమో చాలామంది ఫెయిలయ్యారు… లింగూలిటుకూ అంటూ ఓ రెండు గోల్డ్, మొత్తం ఏడు మెడల్స్ పట్టుకొచ్చారు… పైగా కొన్ని ఈవెంట్లలో మరీ ప్రత్యర్థి దేశం దక్షిణ కొరియా చేతుల్లో ఓడిపోయారు… నియంత దేన్నయినా సహిస్తాడు గానీ దక్షిణ కొరియాపై ఓటమిని ఒప్పుకోడు… ఆ దేశం పేరు వింటేనే తనకు అరికాలి మంట నెత్తికెక్కుతుంది… ఈ ఒలింపిక్స్ ఫెయిల్యూర్ చూసి విపరీతంగా కోపమొచ్చేసింది… ఆ కోపానికి వాళ్లందరినీ ఉరితీయమంటాడేమో అనిపించిందట అధికారులకు… మళ్లీ మూడ్ ఏం మారిందో ఆ తిక్కలోడికి గానీ… ఫెయిలైన క్రీడాకారులందరినీ బొగ్గుబావుల్లో పనిచేయాల్సిందిగా ఆదేశించాడు… అదే వారికి శిక్ష… ఇక మళ్లీ ఛాయిస్ అనేది లేదు… బతుకు బొగ్గు… అంతే… పతకాలు తెచ్చినోళ్లను మాత్రం భేష్ భేష్ అంటూ సత్కరించాడు…

తన తాత కిమి ఇల్ సంగ్ కాలంలో ఉన్న ఓ దురాచారాన్ని నిర్మొహమాటంగా పునరుద్ధరించాడు… అఫ్ కోర్స్ తన ఆలోచనకు ఎదురు చెప్పేవాడెవడు? తన కామ అవసరాల కోసం పక్కా టీనేజీ బాలికలతో ప్లెజర్ స్క్వాడ్స్ ను తిరిగి అమల్లోకి తీసుకొచ్చాడు… ఈ సెక్స్ గ్యాంగ్ పనేమిటంటే… నియంతతోపాటు ముఖ్యమైన సైనికాధికారులు, అధికారుల సెక్స్ అవసరాలు తీర్చడమే..!! ప్రభుత్వపరంగా, అధికారికంగా జరుగుతున్న ఏర్పాటు ఇది… మరీ 13 ఏళ్ల బాలికలను కూడా ఇందులోకి తీసుకుంటారు… మసాజులు చేయాలి, సెక్స్ అవసరాలు తీర్చాలి, పాటలు పాడాలి, డాన్సులు చేయాలి… స్కూళ్ల నుంచి దాదాపు రెండు వేల మందిని ఎంపిక చేస్తారు… వారి అర్హత ఏమిటంటే, అందంగా ఉండటం, మొహంపై ఎలాంటి మచ్చలూ లేకుండా ఉండటం, అన్నింటికీ మించి వర్జిన్లుగా ఉండటం… అన్నిరకాల ఆరోగ్యపరీక్షలు చేసి ప్రస్తుతం ఎలాంటి రోగాలు లేకుండా చూస్తారు… జన్యుపరంగా కూడా ఎలాంటి రోగాలు వచ్చేదీ లేనిదీ ముందే అంచనాలు వేస్తారు… నెలకు నాలుగు వేల డాలర్లు ఇస్తారు… ఈ విభాగాన్ని మొత్తం సైన్యమే పర్యవేక్షిస్తుంది… థూ…

‘‘పురుషులు నాలాగా ఉండాలి… స్త్రీలు నా భార్యలాగా ఉండాలి…’’ ఇదీ తన హుకుం… జీన్స్ , చెవిపోగులు, స్కర్టులు, టీషర్టులు పెట్టుబడిదారుల లక్షణాలట…. తను సృష్టించిన యూత్ గ్రూప్స్ వీటిని కఠినంగా అమలు చేస్తాయి… ఈ పైత్యం ఎక్కడి దాకా పోయిందంటే చివరకు హెయిర్ స్టయిల్ కు కూడా కోడ్ రూపొందించారు…. పురుషులెవరూ రెండు సెంటీమీటర్లకు మించి జుట్టు పెంచకూడదట, తనలాగే హెయిర్ కట్ చేయించుకోవాలట… మహిళలేమో తన భార్య రిసోల్ జుబాబ్ తలకట్టును అక్షరాలా అనుసరించాలట…. తరువాత దాన్ని కాస్త మార్చి 15 రకాల హెయిర్ కట్స్ నిర్దేశించారు… వితంతువులకు, వివాహితులకు, టీనేజర్లకు, వృద్దులకు… ఇలా ఒక్కో ఏజ్ గ్రూపు వారికీ ఒక్కో తరహా హెయిర్ కట్స్…. తుగ్లక్ కు ముత్తాతలా ఉన్నాడే…! అక్కడ ప్రజాభిప్రాయం ఓ బోగస్, అక్కడ ఎన్నికలు ఓ నాటకం, అక్కడ పారదర్శకత ఓ భ్రమ, అక్కడ ప్రజాసంక్షేమం ఓ బూటకం, అక్కడ ఆ మెంటల్ కేసు ఏది చెబితే అదే… తన సొంత మనుషులను ఖతం చేయించాడు… ముఖ్య సైన్యాధికారులను కేవలం అనుమానాలతో హతమార్చాడు… మొన్నటికిమొన్న తన సవతి సోదరుడినీ తనే పొట్టనపెట్టుకున్నాడంటారు… ఇప్పటికీ అమెరికా సామ్రాజ్యవాదమనే పడికట్టు, పిడివాదాల్లో బతికే మేధావులు కూడా ఉత్తర కొరియా అనగానే ఎలా సమర్థించుకోవాలో తెలియని చీకటి

– తండ్రి మరణించినప్పుడు ఎవడైతే మనస్పూర్తిగా ఏడవలేదో, వాళ్లందరినీ శిక్షించారు… వెట్టిచాకిరీ చేయించే శిక్షలు… సరైన ఏడుపా కాదా నిర్ధారిచంటానికి కూడా ప్రత్యేక దళాలు…

– ఉత్తర కొరియాకు ఎరువుల కొరత ఏర్పడితే ప్రతి ఒక్కరూ తమ మలాన్ని ప్రభుత్వానికి ఇచ్చేయాలని ఆదేశాలు… ప్రత్యేకంగా వీటికోసం దుకాణాలు… మలాన్ని వేస్ట్ చేస్తే కూడా శిక్షలు విధించారు…

– ప్రపంచం అంతటికీ ఇప్పుడు 2017సంవత్సరం నడుస్తుంటే… ఉత్తరకొరియాలో మాత్రం 104వ సంవత్సరం… అంతేమరి… మాజీ అధ్యక్షుడు కిమ్ జాంగ్-Il జయంతిని వీరు కొత్త సంవత్సరంగా పరిగణిస్తారు…

– పర్యాటకులను పెద్దగా అనుమతించరు… ఒకవేళ అనుమతించినా స్థానికులెవరితోను మాట్లాడకూడదు… దీనికి కొంతమంది పర్యవేక్షకులు… ఎక్కడ పడితే అక్కడ తిరగనివ్వరు… ఎయిర్ పోర్టులో దిగగానే తమ మొబైల్ ఫోన్లను అక్కడ ఇచ్చేయాలి…

– ఇంటర్‌నెట్, కార్లు కొందరికి మాత్రమే… కేవలం మూడు న్యూస్ చానెల్స్… ఒక రేడియో… ప్రభుత్వం చెప్పిందే ప్రసారం చేయాలి… పేదలను ఫోటోలు తీయడం నిషిద్దం…

– ఇక్కడ బైబిల్ చదివినా.. హాలీవుడ్ సినిమాలు చూసినా మరణశిక్షలు తప్పవు…దేశంలో దాదాపు 3 లక్షల మంది ప్రజలు జైళ్లలో ఉన్నారు… ఖైదీల మీద మెడికల్ ప్రయోగాలు జరుగుతుంటాయి… చచ్చినా, బతికినా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోదు…

– ఎన్నికలు ఓ బూటకం… ఒకడే నిల్చుంటాడు… ఒకే పార్టీ… అందరూ ఓట్లేయాలి… ఓటేయకపోయినా, ఆ ఏకైక అభ్యర్థిని తిరస్కరించినా ఇక శిక్షలే శిక్షలు… అవి నరకం చూపిస్తాయి… అత్యంత బూటకంగా సాగే ఎన్నికలు అవి…

– ఇళ్లు బూడిర రంగులో ఉండాలి… కిమ్ ఫోటోలు తప్పనిసరిగా ఉండాల్సిందే… తన తండ్రి మరణించిన జూలై 8న ఏ వేడుకలైనా నిషిద్ధమే… ఒక వ్యక్తికి శిక్ష పడితే… తర్వాత రెండు తరాలు కూడా శిక్షార్హులు…

– వారంలో ఒక రోజు దేశం కోసం పనిచేయాలి… అర్థమైంది కదా… ఉత్తర కొరియా కథేమిటో… చైనా, రష్యా చెప్పినట్టల్లా వింటూ… ఇప్పుడు ఖండాంతర క్షిపణులు, అణ్వాయుధాలతో అదరగొడుతున్నాడు ఆ పాలకుడు… సో, ఒక్కసారి ఈ దేశం చరిత్ర విని, పాలన తీరు చదివారు కదా… మన దేశంతో ఓసారి పోల్చిచూడండి… ఐనా మన దేశంపై మనవాళ్లే నిరంతరం ఏడుస్తూ ఉంటారు… ఖర్మ…!!
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)