బాణ పొట్టకు బ్రహ్మాస్త్రంగా ఈ పదార్దం. తింటే మీ బరువు ఇట్టే తగ్గిపోతుంది

ఈ రోజుల్లో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పొట్ట వస్తోంది. వయసుతో సంబంధం లేకుండా స్థూలకాయం తో బాధపడుతున్నారు. ఆ పొట్టను, స్థూలకాయాన్ని తగ్గించుకొవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే దానిని అలానే కొనసాగిస్తే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే సహజ పద్ధతులను ఉపయోగించి వీటిని ఎలా తగ్గించుకోవచ్చో చూద్దాం. 
 • వేరుశనగలు బెల్లం, నువ్వులు రోజూ తింటూ ఉంటే కూడా బానపొట్టను తగ్గించుకొవచ్చని నిపుణులు చెబుతున్నారు. 
 • నువ్వులలోని నూనె మంచి కొలెస్ట్రాల్ ను వృద్ది చేస్తుంది. అంతేకాదు శరీరానికి ఎలాంటి హాని కలుగదు. 
 • భోజనం చేసిన వెంటనే నువ్వులను మెత్తగా నమిలి మింగాలి. ఇలా మూడు లేక నాలుగు నెలలపాటు తినడం వల్ల ఏడు నుంచి ఎనిమిది కేజీ ల బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. 
 • అయితే ఈ నువ్వులను చలి, వర్షా కాలాల్లో మాత్రమే తినాలి. అలా చేయడం వల్ల నువ్వుల్లోని క్షారత్వం వల్ల పొట్ట తగ్గడం ద్వారా బరువు తగ్గిపోవడం ఈజీ అవుతుంది. 
 • అలాగే వారానికి ఒక రోజు అన్నిపూటలూ భోజనానికి బదులుగా కూరగాయలు, ఆకుకూరలతో చేసిన సలాడ్ ను తింటూ ఉండాలి. దీని వల్ల పొట్టతగ్గి బరువు కూడా తగ్గుతారు. 
 • ఇలాచేస్తే.. బరువు తగ్గే క్రమంలో శరీరానికి తగిన పోషకాలు కూడా లభిస్తాయి. అలాగే అహారాన్ని బాగా నమిలి మింగాలి. 
 • చిన్న ప్లేట్ లో అన్నం తినడం వల్ల తెలియకుండానే రోజుకు కనీసం 250 కాలరీలు తక్కువ తింటారట. 
 • ప్రతిరోజూ నిదుర లేచిన గంట లోపే బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేయాలి. ఆలస్యంగా తింటే రెండు పూటల మధ్య సమయం తగ్గి కొవ్వు పెరిగే ప్రమాదం ఉంది. 
 • రోజూ పాల ఉత్పత్తులు ఎంతో కొంత పరిమాణంలో తీసుకోవాలి వీటిలోని కాల్షియమ్ కొవ్వును కొంతమేర కరిగిస్తుందట. 
 • వ్యాయామం చేసిన గంటలోపు భోజనం చేయాలి. 
 • భోజనానికి ముందు నారింజ లాంటి నిమ్మజాతి పండు సగం తినడం వలన పొట్ట మరియు బరువు తగ్గుతుంది. 
 • అలాగే వారంలో మూడురోజులు గుడ్లు మాత్రమే ఒకపూట ఫుడ్ గా తీసుకోవాలి. అది కూడా ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే మంచిది. 
 • వారంలో ఒకపూట చేపలు తినాలి. ఇలా చేయడం వలన పొట్ట మరియు స్తూలకాయాన్ని ఈజీగా తగ్గించుకొవచ్చు. 
 • ఇక వేరుశనగలు, బెల్లం కలిపి తింటూ ఉండాలి. ఇవి శరీరానికి తగిన పోషకాలు అందించి కొవ్వును కరిగిస్తాయి. 
 • ఈ నియమాలు ఆచరించే క్రమంలో శరీరానికి కావల్సిన కొవ్వును నువ్వులు, వేరుశనగల ద్వారా అందుతాయి కాబట్టి ఆయిల్ ఫుడ్స్ తగ్గించాలి. ఇంకా ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం మానేస్తే అనూహ్యమైన ఫలితాలు త్వరగా చూడొచ్చు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)