ఆయనకి ఆకలేస్తే కరెంట్ వైర్ నోట్లో పెట్టుకుని విద్యుత్‌ను తీసుకుని జీవిస్తున్నాడు

Loading...
కరెంటు వైరుని చూస్తేనే ఆమడదూరంలో ఉంటాం..అలాంటిది విద్యుత్ తో జీవనం సాగిస్తూ షాక్ ఇస్తున్నాడు ఓ వ్యక్తి. బీహార్ లోని ముజఫ్ నగర్ కి చెందిన నరేశ్‌కుమార్‌ కి కరెంటుతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఎంతటి హైవోల్టేజ్‌ కరెంట్‌ అయినా నరేశ్‌ను ఏమీ చేయలేదు. అంతేకాదండోయ్‌.. శరీరానికి కావాల్సిన శక్తిని అందరూ ఆహారం ద్వారా పొందుతుంటే ఈయన మాత్రం నేరుగా విద్యుత్‌ను తీసుకుని జీవిస్తున్నాడు. 42 ఏళ్ల నరేశ్‌ మాత్రం తనకున్న ఈ ప్రత్యేకతను అనుకోకుండా గ్రహించానని చెబుతున్నాడు. తానొకసారి పనిచేస్తుండగా అనుకోకుండా కరెంటు వైర్‌ను తాకానని అయితే అదృష్టం కొద్దీ ఎలాంటి హాని జరగలేదని చెప్పుకొచ్చాడు. అప్పటి నుంచి కరెంటు వైర్లను తాకడం.. నోట్లో పెట్టుకోవడం చేస్తుండేవాడు.

అలా తన ఆహారాన్నే విద్యుత్‌గా మార్చుకున్నాడు. ఇంట్లో తినడానికి ఏమీ లేకపోతే కరెంటు వైర్లను నోట్లో పెట్టుకుంటానని, అలా ఒక అర్ధ గంటలోపే తన ఆకలి తీరిపోతుందని నరేశ్‌ చెప్పాడు. ప్రస్తుతం తన శరీరంలో దాదాపు 80 శాతం ప్రస్తుతం కరెంటు ఉందని తెలిపాడు. ‘ఆయనను తాకితే ఎక్కడ షాక్‌ కొడుతుందోనని నేను, నా పిల్లలు నిత్యం భయపడుతున్నాం’ అని నరేశ్‌ భార్య భయంభయంగా చెప్పింది. నోటిలో, చేతుల్లో కరెంటు వైర్లు పట్టుకున్న నరేశ్‌ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. అందరూ నరేశ్‌ను సోషల్‌ మీడియాలో ఇండియా లివింగ్‌ లైట్‌ బల్బ్‌గా పిలుచుకుంటున్నారు.
Loading...

Popular Posts