ఆధార్ కార్డులో తప్పులుంటే సరిదిద్దుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారా ? పోస్టాఫీసుల్లోనే 15 నిమిషాల్లో అప్‌డేట్ చేసేస్తారు

ఆధార్ కార్డులో తప్పులుంటే.. సరిదిద్దుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారా..? ఎక్కడ అప్ డేట్ చేస్తారో.. ఎక్కడ డౌన్ లోడ్ చేసుకోవాలో తెలియక సతమతమవుతున్నారా..? ఇకపై ఈ టెన్షన్ అవసరం లేదు. పోస్టాఫీసుల్లోనే ఈ పని చేసేస్తారు. 15 నిమిషాల్లో అప్‌డేట్ చేసేస్తారు. 24 గంటల్లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 15 రోజుల్లో ఒరిజినల్ కార్డు తెచ్చుకోవచ్చు. ఆధార్‌ అప్‌డేషన్‌కు రూ.25 వసూలు చేస్తారు. బయోమెట్రిక్‌కు రూ.25, కొత్తగా జనరేట్‌ కోసం రూ.50 వసూలు చేస్తారు. ఈ మేరకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ)తో తపాలా శాఖ ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలోని హెడ్‌ పోస్టాఫీసుల్లో ఆధార్‌ అప్‌డేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని పాతబస్తీలోని జూబ్లీ హెడ్‌ పోస్టాఫీసులో ఏర్పాటు చేసిన ఆధార్‌ కేంద్రంలో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టగా, మిగతా పోస్టాఫీసుల్లో ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్‌ 1 నుంచి అన్ని సబ్‌ పోస్టాఫీసుల్లో కేంద్రాలు ప్రారంభించే విధంగా తపాలా శాఖ చర్యలు చేపట్టింది. తపాలా శాఖ సిబ్బందికి ఆధార్‌ నమోదు, అప్‌డేషన్‌పై యూ ఐడీఏఐచే శిక్షణ ఇప్పించారు. ప్రధాన పోస్టాఫీసుల్లో త్వరలో ఆధార్‌ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే బయోమెట్రిక్‌ డివైజ్‌ల కోసం చెన్నై కు చెందిన సంస్థతో టెండర్‌ ప్రక్రియ పూర్తి చేశారు.
Loading...

తాజా వార్తలు