షాకింగ్ నిజాలు.. కొలెస్ట్రాల్ కి గుండె జబ్బులకి సంబంధమే లేదు.. ఇదంతా కార్పొరేట్ కంపెనీల మాయ.. తేల్చి చెప్పిన తాజా పరిశోధన

ఒకతను హోటల్‌లో పూరీ ఆర్డరిచ్చాడు… పూరీలు రాగానే పేపర్ న్యాప్‌కిన్లతో అద్ది, ఆయిల్ అంతా దానికి అంటుకున్నాక తిన్నాడు…….. మరొకతను బాయిల్డ్ ఎగ్స్ ఆర్డరిచ్చాడు… అందులో పచ్చ సొనంతా తీసేసి, వైట్ మాత్రమే తిన్నాడు…… అమ్మో మటన్ అంటూ దూరం ఉంటాడు ఒకతను… అయ్యో, అయ్యో, వెన్న, నెయ్యి, పెరుగు, అన్నం… నేను బతకాలా, చావాలా అని కేకలేస్తుంటాడు ఇంకొకతను… నిజమేనా..? ఇవన్నీ బ్యాడ్ కొలెస్ట్రాలా..? చావుకు దగ్గర చేస్తాయా..? అసలు కొలెస్ట్రాల్ (కొవ్వు అందామా..?) అంత హానికరమా..? సిగరెట్, మందు కన్నా ప్రమాదకరమా..? ఒక డాక్టర్ ఒకటి మానేయమంటాడు, ఇంకో డాక్టర్ ఇంకొకటి మానేయమంటాడు… ఇక నెట్‌లోకి వెళ్తే, సైట్లన్నీ చదివితే అసలు తినడం మానేయడమే బెటరనేంత వైరాగ్యం వచ్చేలా హెచ్చరికలు, సూచనలు… కందమూలాలు కూడా ప్రమాదకరమే… ఆకులుఅలములు మాత్రమే కాస్త బెటర్… అయితే కొలెస్ట్రాల్ అనేది ఆందోళనకరం కాదని చెబుతున్నాయి తాజా అధ్యయనాలు… వివరాల్లోకి వెళ్దాం…

‘‘అమెరికా ప్రభుత్వం ఎట్టకేలకు కొలెస్ట్రాల్ అనే పదాన్ని ఆందోళనకర అంశాల జాబితా నుంచి తొలగించింది… మరిన్నాళ్లూ గుండె జబ్బులకు అదే కారణం, అందులో హెచ్‌డీఎల్, ఎల్‌డీఎల్ రకాలు… ఏది మంచి, ఏది చెడు… ఏది తింటే ఏం పెరుగుతుంది,… అని రకరకాల సలహాలు, విశ్లేషణలు… ప్రపంచం మొత్తాన్ని ఓ అశాస్త్రీయ భ్రమల్లో ముంచేశారు… చెడు కొలెస్ట్రాల్ పెరిగితే రక్తనాళాలు బ్లాకయిపోతాయి… గుండెపోటు వచ్చి చస్తారురోయ్ అన్నట్టు ప్రచారం చేశారు… అయితే ఇదంతా కార్పొరేట్ కంపెనీల మాయ..  ఇప్పుడు అమెరికన్ హార్ట్ అసోసియేషన్, అమెరికన్ కాలేజీ ఆఫ్ కార్డియాలజీ అధ్యయనాల మేరకు రక్తంలోని కొలెస్ట్రాల్‌కు, మనం ఆహారంగా తీసుకునే కొలెస్ట్రాల్‌కూ అసలు సంబంధం లేదు పొండి’’ అని అమెరికా వ్యవసాయ శాఖ తేల్చి చెబుతున్నది… ప్రతి అయిదేళ్లకు ఓసారి అది ఇలాంటి విషయాల్లో సమీక్ష జరుపుతుంది… ప్రామింగ్‌హామ్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ జార్జ్ వి.మాన్ ఏమంటాడంటే..? ‘‘గుండె జబ్బులకు మనం తీసుకునే సాచురేటెడ్ ఫ్యాట్స్, కొలెస్ట్రాల్‌కు సంబంధం లేదు… ఇది ఇన్నాళ్లూ చెలామణీలో ఉన్న ఓ మిథ్య, ఓ భ్రమ… కొలెస్ట్రాల్ అనే పదం పెద్ద స్కామ్… అసలు కొలెస్ట్రాల్‌లో బ్యాడ్, గుడ్ అనేదే లేదు…’’

‘‘సాధారణ కొలెస్ట్రాల్ లెవల్స్ ఉన్నవారికి గుండెపోట్లు వచ్చిన ఉదాహరణలు బోలెడు… మనకు మన సాధారణ జీవక్రియలకు రోజూ 950 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ కావాలి… మనం తినే ఫుడ్ నుంచి మహాఅయితే 15 శాతం కొలెస్ట్రాల్ నేరుగా లభిస్తుంది… మిగతాదంతా మన కాలేయం ఉత్పత్తి చేసేదే… మన కొలెస్ట్రాల్ లెవల్స్ బాగున్నాయంటే మన కాలేయం బాగా పనిచేస్తున్నట్టు లెక్క… ఆ కొలెస్ట్రాల్‌లో చెడు, మంచి అనే వర్గీకరణ లేదు… మానవ శరీర రక్తనాళాల్లో బ్లాక్స్‌ను క్రియేట్ చేయడం అనేది కొలెస్ట్రాల్ వల్ల కాదు…’’ ఇదీ ఆ అధ్యయనాల సారాంశం… అయితే ఇక్కడ ఓ ‘ముచ్చట’… ఇది తిను, ఇది తినకు అని భారతీయ శాస్త్రాలు ఆంక్షలు, పరిమితులు పెట్టడం లేదు యుగాలుగా, తరాలుగా… ఏది తిన్నా పరిమితి అవసరం, అతిగా వద్దు అనే చెబుతున్నాయి… సరైన శారీరక శ్రమ ఉంటే ఏ కొలెస్ట్రాల్ కూడా ఏమీ చేయలేదు అని చెబుతున్నాయి మన సంప్రదాయిక వైద్యవిధానాలు… అదే ఆచరణీయం అని మరోసారి అర్థమవుతున్నట్టే కదా..?!
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)