అత్యంత క్రూరుడైన ఔరంగజేబును వణికించిన ఆలయం ఇది

ఔరంగజేబు మొఘల్ రాజైన షాజహాన్ కుమారుడు. ఇతడు క్రీ.శ.1650 నుండి 1707 వరకు డిల్లీని రాజధానిగా చేసుకుని భారతదేశాన్ని పరిపాలించాడు. చాలా తెలివైన వాడు. కానీ వివాదాస్పదుడు. తను అనుకున్నది సాధించడానికి ఎంతటి క్రూరానికైన సిద్ధపడేవాడు. అతడి జీవితకాలంలో అనేక క్రూరమైన పనులు ఎన్నో చేసాడు. అందులో మచ్చుకు కొన్ని. ఔరంగజేబు చక్రవర్తి అయ్యాడని తెలిసి అతడికి విద్యాబుద్ధులు నేర్పిన మూల్లాషా అనే గురువు తనకు ఏదైనా బహుమతి లభిస్తుందనే వుద్దేశంతో ఔరంగజేబు దగ్గరికి వస్తాడు. 3నెలలు అతడ్ని చూసీచూడనట్టు వ్యవహరించిన ఔరంగజేబు ఒక రోజు గురువును దర్బారుకు పిలిపించి చడామడా తిట్టాడు. నువ్వు నాకేమైనా పనికొచ్చే చదువు చెప్పావా? ఎదుటి రాజ్యాల గురించి నువ్వనీ తప్పులే చెప్పావు. నాకు అరబిక్ భాష తప్ప ఇంకో భాష నేర్పవా ? పనికిరాని గ్రామర్లు నేర్పావు. ఏదో ఒకనాటికి నా సోదరులతో యుద్ధం చేయాల్సివస్తుందన్న విషయం నాకు నేర్పావా ? అదృష్టం కొద్ది నీకంటే తెలివైనవారిని సంప్రదించాను. కాబట్టి బతికిపోయాను. ఏం వుద్దరించావని నిన్ను సన్మానించాలి. పోపో నువ్వు ఎవరో ఏమైపోయావో కూడా నాకు తెలియకూడదు అని అంటాడు. మొఘల్ రాజులు మన దేశంలో అడుగుపెట్టాక అనేక హిందూ రాజ్యాలను ధ్వంసం చేసారు. పేరు మోసిన అనేక కళాఖండాలను నామరూపాల్లేకుండా చేసారు. హిందూసంస్క్రుతిని పెంచిపోషించిన వారిలో హీరో లాంటి వాడు అక్బర్ అయితే మోస్ట్ విలన్ గా పెరుమోసింది ఔరంగజేబు. అవును అతని కన్ను పడని ఆలయం లేదు. ధ్వంసం కాని చరిత్ర లేదు ఒకటి తప్ప. ఔరంగజేబు అన్ని ఆలయాలను ధ్వంసం చేసినట్టే కైలాస టెంపుల్ ను కూడా నామరూపాలు లేకుండా చేద్దామనుకున్నాడు. కానీ ఇటుక మందం కూడా చెక్కుచెదర్చ లేకపోయాడు. కానీ ఆ కైలాస టెంపుల్ ఎక్కడుందో తెలుసా? దాన్ని ఔరంగజేబు ఎందుకు తాకలేకపోయాడో తెలుసా? ఔరంగజేబును వణికించిన ఆలయం పూర్తి వివరాలు ఇవే.
  • కైలాస టెంపుల్ మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లో వుంది. గుహ అంటే ఈ టెంపుల్ బయటకు కనపడదని కాదు. నిక్షేపంగా కనిపిస్తుంది. ఇది ఇటుకలతోనో,పెద్దపెద్ద రాళ్ళు పేర్చో కట్టిన కట్టడం కాదు. పూర్తిగా ఒక కొండను తొలచి నిర్మించిన ఆలయం. 
  • మొత్తం 4 లక్షల టన్నుల రాతిని తొలిస్తే ఆ ఆలయానికి ఒక ఆకారం వచ్చింది. అంత పెద్ద మొత్తంలో రాయిని చెక్కి ఒక రూపు తీసుకురావాలంటే అప్పటి రోజులను బట్టి కనీసం 200సంలు కావాలి. కానీ కేవలం 18సంలు. 18ఏళ్ళపాటు నాలుగు లక్షల టన్నుల రాయిని తొలచి కైలాస్ టెంపుల్ కట్టారు. 
  • 4లక్షల టన్నులంటే ఏడాదికి 22,222 టన్నుల రాయి. అంటే రోజుకు 60 టన్నులు. రోజులో 12గంటలపాటు పని చేసారనుకున్నా గంటకు 5టన్నుల రాయిని పెకిలించాలి. అది కూడా అడ్డదిడ్డంగా కాదు. ఆలయానికి కావలసిన షేప్లో చెక్కుతూ అంతరాయిని తీసేయాలి. ఇప్పుడున్న అంత అత్యాధునిక మిషనరీలు వాడినా గంటలో 5టన్నుల రాయిని పెకిలించటం అసాధ్యం. మరి అలాంటివాళ్ళు ఇంత ఘనకార్యాన్ని ఎలా సాధించారో వారికే తెలియాలి.
  • ఆకాశం నుంచి చూస్తే ఈ టెంపుల్ ఎక్స్ షేప్ లో వుంటుంది. భూమి మీద నుండి చూస్తే 4 సింహాలు xఆకారంలో నిలుచున్నట్లు కనిపిస్తుంది. అంతేకాదు ఈ ఆలయనిర్మాణంలోనే వాటర్ హార్వెస్టింగ్ సౌకర్యం వుంది. ఎక్కడికక్కడ డ్రైనేజ్, రహస్యమార్గాలు, బాల్కానీలు, అప్స్టైర్స్ ఎన్నో అద్భుతాలు వున్నాయి. అన్ని కూడా రాయితో చెక్కింది. 
  • 1680లో ఔరంగజేబు కైలాసాలయాన్ని ధ్వంసం చేయాలని ప్లాన్ వేసాడు. 1000మంది పనివాళ్ళనిపెట్టాడు. 3ఏళ్ళు దాన్ని కూల్చటానికి కష్టపడ్డాడు. కానీ అడ్డంగా ఫెయిలయ్యాడు. 
  • అన్నేళ్లల్లో వాళ్ళు చేసింది కేవలం కొన్ని విగ్రహాలకు గాట్ లు పెట్టడమే. అంతకు మించి ఏమీ చేయలేకపోయాడు. ఏం వింతో గానీ కనీసం ఆలయంలోని గర్భ గుడిలో కూడా వెళ్ళలేకపోయాడు. ఈ వింతను చూస్తూనే మూడేళ్ళు పంతంతో కష్టపడ్డాడు ఔరంగజేబు కానీ ఏమీచేయలేని నిస్సహాయ స్థితిలో తన ఓటమిని అంగీకరించి వెనుదిరిగాడు. అందుకే ఎల్లోరా కేవ్స్ తో పాటు ఈ ఆలయం కూడా వరల్డ్ హిస్టరీ.
  • మరి ఇంత అద్భుతమైన ఆలయాన్ని ఎవరు కట్టారో. ఎలా కట్టారో తెలియదు. ఆ అద్భుతం వెనకవున్న రహస్యం ఏంటో ఇప్పటికీ అర్ధంకాలేదు.
Loading...

తాజా వార్తలు