తమ్ముడికి రాఖి కట్టి కిడ్నీ దానం చేసిన అక్క

అన్నదమ్ములు తమను కట్టికి రెప్పలా కాపాడాలని, జీవితాంతం తమకు రక్షణగా ఉండాలని రక్షా బంధన్ రోజున అక్కచెల్లెళ్లు రాఖీలు కడతారు. కానీ ఓ సోదరి మాత్రం తన తమ్ముడికి కిడ్నీ దానం చేసింది. రక్షా బంధన్ రోజున సురక్షితంగా ఇంటికి తిరిగొచ్చిన తమ్ముడికి రాఖీ కట్టింది. ఆగ్రాకు చెందిన వివేక్ సారాబాయి (38) అనే వ్యక్తి రెండు కిడ్నీలు పాడైపోయాయి. ఆ కిడ్నీలు తొలగించకపోతే ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు చెప్పారు. దీంతో ఆయన సోదరి వందన చంద్ర (48) కిడ్నీ దానం చేసేందుకు ముందుకు వచ్చారు. వందన నుంచి కిడ్నీని సేకరించిన డాక్టర్లు దాన్ని వివేక్‌కు విజయవంతంగా అమర్చారు. ఆదివారం ఆసుపత్రిని అయిన వివేక్ తన అక్కతో రాఖీ కట్టించుకునేందుకు ఇంటికి వచ్చారు.

ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. ‘నా రెండు కిడ్నీలు పనిచేయడం మానేసాయని డాక్టర్లు నిర్ధారించారు. కిడ్నీ దాత కోసం చాలా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను సంప్రదించాం. చివరకి ఎయిమ్స్, సఫ్దర్జంగ్, లక్నో ఎస్జీపీజీఐ, వేదాంత, అపోలో ఆసుపత్రుల్లో కూడా ప్రయత్నించాం. కానీ దాత దొరకలేదు. దీంతో చాలా తక్కువ సమయంలోనే నా ఆరోగ్య పరిస్థితి చాలా క్షిష్టంగా మారిపోయింది. అలాంటి పరిస్థితుల్లో మా అక్క నాకు పునర్జన్మను ప్రసాదించింది’ అని వివేక్ చెప్పారు. ఆయన ఆగ్రా జిల్లా కోర్టులో లాయర్‌గా పనిచేస్తున్నారు.

‘నా తమ్ముడంటే నాకు ప్రాణం. క్లిష్ట పరిస్థితుల్లో నా వెన్నంటే ఉన్నాడు. నేను గర్భవతిగా ఉన్నప్పుడు తనే నాకు వంట చేసి భోజనం పెట్టేవాడు. నన్ను కాలు కింద పెట్టనివ్వకుండా అన్ని పనులు చూసుకున్నాడు. అతని జీవితాన్ని నిలపడం నాకొక అవకాశం. ఈ రక్షా బంధన్ నాకు ఎంతో విలువైనది. నా తమ్ముడు జీవితాన్ని కాపాడి అతనికి రాఖీ కడుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది’ అని వందన కంటతడి పెట్టుకున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)