బరువు తగ్గాలని పట్టుదలతో ఉన్నారా? అయితే జస్ట్ మీ కర్రీలో ఇది కొద్దిగా వేయండి, త్వరగా రిజల్టు వస్తుంది

బరువు తగ్గడం అనేది నిరంతర ప్రక్రియ. కొందరిలో బరువు తగ్గాలనే పట్టుదల బాగా ఉన్నా అవగాహనా లోపంతో సంవత్సరాల తరబడి ఈ సమస్యను మోస్తూనే ఉంటారు. కేవలం ఎక్సర్ సైజ్ లు, వర్కవుట్లు చేయడం మాత్రమే అధిక బరువుకు పరిష్కారమని నమ్ముతారు. అయితే అది పాక్షిక సత్యమే.. ఒకసారి బరువు పెరిగిన, ఒంట్లో కొవ్వు పేరుకుపోయి పొట్ట వచ్చిన తర్వాత దానిని తగ్గించుకునేందుకు జీవన శైలిలో ఎన్నో మార్పులు చేయాల్సి ఉంటుంది. విచిత్రం ఏమిటంటే కొన్ని చిన్న చిన్న మార్పులతో కూడా అద్భుతమైన రిజల్టు పొందొచ్చు. కాకపోతే ఆ చిట్కాలు మనకు తెలియకపోవడమే మైనస్. ఇప్పుడు అటువంటి సులువైన చిట్కా ఒకటి చూద్దాం.. దీనిని ఆచరించి ఆశిలించిన ఫలితాన్ని త్వరగా పొందుదాం..

రోజూ మీరు తినే వంటల్లో కొద్దిగా కొబ్బరి నూనె వేయడం ద్వారా బరువు తగ్గుతారు. ఛీ తలకు రాసుకునే కొబ్బరి నూనె వంటల్లో ఏంటి? అని మాత్రం మొహం చిట్లించకండి. వంటల్లో వాడేందుకు కొబ్బరినూనె ప్రత్యేకంగా దొరుకుతుంది. ఇందులోని మీడియం చైన్ ఫ్యాటి యాసిడ్స్ అనే ఒక పదార్ధం గుండెకి, వంటికి కొవ్వు పట్టనివ్వదు. అలాగే చెడు కొవ్వును వెంటనే కరిగిస్తుంది. బాడీలోని అధిక కొలెస్ట్రాల్ ను కరిగించి బరువు తగ్గించడానికి చాలా సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో ఉండే విటమిన్ ఇ చర్మానికి మంచి నిగారింపు ఇస్తుంది. కింద చెప్పిన విధంగా కాఫీ పెట్టుకుని తాగి కూడా ఈజీగా బరువు తగ్గొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

వేగంగా బరువు తగ్గడంలో ఇప్పుడిది కొత్త ట్రెండ్. కాఫీలో కొబ్బరి నూనెను కలిపి తీసుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గుతారట. కాఫీలో ఉండే కెఫిన్ ఒంట్లోని కేలరీలను కరిగించడానికి ఉపయోగపడుతుంది. కెఫిన్‌ను మితంగా తీసుకోవడం వల్ల చురుగ్గా ఉండటంతో పాటు.. బరువును తగ్గించుకోవచ్చు. ముందే చెప్పుకున్నట్టు బరువు తగ్గించుకోవడానికి కొబ్బరి నూనె కూడా ఉపయోగపడుతుంది. మిగతా కొవ్వులు లాంగ్ చెయిన్ ఫ్యాటీ యాసిడ్లుగా మారితే.. కొబ్బరిలోని కొవ్వులు మాత్రం మీడియం చెయిన్ ఫ్యాటీ యాసిడ్లు అని చెప్పుకున్నాం కదా. వీటిని కాలేయం (లివర్) శక్తి రూపంలోకి లేదా కీటోన్ల రూపంలోకి మారుస్తుంది. వాస్తవానికి కాఫీ, టీలు బరువు తగ్గాలనుకునే వారు తాగకపోవడమే మంచిది.. కాని ఆ అలవాటు చాలా మంది వదల్లేరు. అటువంటి వారు.. ఉదయాన్నే కాఫీలో సహజమైన కొబ్బరి నూనె కలుపుకొని తాగడం వల్ల మెరుగైన ఫలితాలు పొందొచ్చట. కాఫీలో కొబ్బరి నూనెంటండీ బాబు.. అనుకుంటున్నారా? ఇలా చేయడం వల్ల కాఫీ రుచిలో తేడా ఏం రాదు. కప్పు కాఫీలో రెండు చెంచాల కొబ్బరి నూనె కలిపి తాగేస్తే సరి. ఈ కాఫీ తాగిన తర్వాత వర్కౌట్ చేయడం వల్ల త్వరగా అలసిపోకుండా ఉంటాం కూడా అంటున్నారు నిపుణులు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)