బంగారం, వెండి ఆభ‌ర‌ణాల క‌న్నా రాగితో చేసిన ఆభ‌ర‌ణాల‌ను ధ‌రిస్తేనే మ‌న శ‌రీరానికి ఎక్కువ లాభాలు ఉంటాయి

రాత్రంతా రాగి పాత్ర‌లో నిల్వ ఉంచిన నీటిని ఉద‌యాన్నే తాగితే దాంతో ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని అంద‌రికీ తెలిసిందే. దీని వ‌ల్ల ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అయితే రాగి పాత్ర‌లో నిల్వ ఉంచిన నీరే కాదు, రాగితో చేసిన ఉంగ‌రం, బ్రేస్‌లెట్‌, చెయిన్ వంటి ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించినా దాంతో మ‌న‌కు ఎంతగానో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. బంగారం, వెండి త‌దిత‌ర లోహ‌పు ఆభ‌ర‌ణాల క‌న్నా రాగితో చేసిన ఆభ‌ర‌ణాల‌ను ధ‌రిస్తేనే మ‌న శ‌రీరానికి ఎక్కువ లాభాలు ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
  1. రాగితో చేసిన ఉంగ‌రం, బ్రేస్‌లెట్ లేదా చెయిన్‌ల‌ను ధ‌రిస్తే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దీంతో శ‌రీరంలో ఉన్న వ్య‌ర్థాలు బ‌య‌టికి వెళ్లిపోతాయి. ఫ్రీ ర్యాడిక‌ల్స్ ప్ర‌భావం త‌గ్గుతుంది. సంపూర్ణ ఆరోగ్యం ల‌భిస్తుంది.
  2. సూర్యుని నుంచి విడుద‌ల‌య్యే పాజిటివ్ శ‌క్తి రాగి ఆభ‌ర‌ణాల ద్వారా నేరుగా మ‌న శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంది. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
  3. కాప‌ర్ జ్యువెల్ల‌రీని ధ‌రించ‌డం వ‌ల్ల మ‌న‌స్సు ఎల్ల‌ప్పుడూ ప్ర‌శాంతంగా ఉంటుంద‌ట‌. ఎలాంటి ఆందోళ‌న‌, ఒత్తిడి ద‌రి చేర‌వ‌ట‌.
  4. శ‌రీరానికి చ‌ల్ల‌దనాన్నిచ్చే గుణం రాగిలో ఉంది. క‌నుక రాగి ఆభ‌ర‌ణాల‌ను ధ‌రిస్తే శ‌రీర ఉష్ణోగ్ర‌త పెర‌గ‌దు. దీంతో జ్వ‌రం వంటి వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు.
  5. బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. గుండె కొట్టుకోవ‌డం స‌హ‌జ ప్ర‌క్రియ‌లో, సాధార‌ణ రేటులో జ‌రుగుతుంది.
  6. శ‌రీరంలో ఉన్న వాపులు, నొప్పులు త‌గ్గిపోతాయి. ప్ర‌ధానంగా కీళ్ల నొప్పులు త‌గ్గిపోతాయి.
  7. జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు త‌గ్గిపోతాయి. గ్యాస్‌, అసిడిటీ దూర‌మ‌వుతాయి.
  8. చ‌ర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. చ‌ర్మం, గోళ్లు, వెంట్రుక‌ల స‌మ‌స్య‌లు పోతాయి. చ‌ర్మం శుద్ధి అవుతుంది.
  9. త‌ల‌నొప్పితో బాధ‌ప‌డే వారు కాప‌ర్ ఆభ‌ర‌ణాల‌ను ధ‌రిస్తే ఫ‌లితం ఉంటుంది.
  10. రాగి ఆభ‌ర‌ణాలను ధ‌రించడం వ‌ల్ల వాటిలో ఉండే రాగి అణువులు ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్మం ద్వారా శ‌రీరంలోకి వెళ్తూ ఉంటాయి. దీంతో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఇత‌ర మిన‌రల్స్ కూడా స‌క్ర‌మంగా అందుతాయి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)