శివ‌పార్వ‌తుల క‌ల్యాణం జ‌రిగిన ప్ర‌దేశ‌మిదే.. దీన్ని ద‌ర్శిస్తే లైఫ్ లాంగ్ భార్యా భర్తల మధ్య సమస్యలనేవి ఉండవు

హిందూ సాంప్ర‌దాయం ప్ర‌కారం పెళ్లి అంటే మూడు ముళ్ల బంధం. ఇద్ద‌రు దంప‌తులు ఒక్క‌ట‌య్యే శుభ ముహూర్తాన దేవ‌త‌లు, దేవుళ్లు కూడా ఆశీర్వ‌దిస్తారు. దంప‌తులిరువురు త‌మ జీవితంలో ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండా సుఖ సంతోషాల‌తో జీవించాల‌ని పెద్ద‌లు ఆశీర్వ‌దిస్తారు. అయితే భార్యాభ‌ర్త‌ల జీవితం మ‌రింత సుఖ‌మ‌యంగా ఉండాలంటే ఉత్త‌రాఖండ్‌లోని ఓ ప్రాంతంలో ఉండే శివాల‌యాన్ని ద‌ర్శించాల‌ట‌. దీంతో వారి స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గిపోతాయ‌ట‌. ఉత్త‌రాఖండ్‌లోని రుద్ర‌ప్ర‌యాగ్ జిల్లా త్రియుగినారాయ‌ణ్ అనే గ్రామంలో వేల సంవ‌త్స‌రాల చ‌రిత్ర క‌లిగిన పురాత‌న శివాల‌యం ఉంది. ఇక్క‌డ ఒక‌ప్పుడు పార్వ‌తీ దేవి శివున్ని వివాహ‌మాడాల‌ని త‌లంచి అనేక సంవ‌త్స‌రాల పాటు త‌ప‌స్సు చేసింద‌ట‌. దీంతో పార్వ‌తి త‌ప‌స్సుకు మెచ్చిన శివుడు ఈ దేవాల‌యంలో విష్ణువు స‌మ‌క్షంలో పార్వ‌తిని వివాహం చేసుకున్నాడ‌ట‌. అయితే ఇక్క‌డ పెళ్లి చేసుకునే వారితోపాటు పెళ్ల‌యిన వారు కూడా ఈ దేవాల‌యాన్ని సంద‌ర్శిస్తే వారి దాంప‌త్య క‌ష్టాలు తొల‌గుతాయ‌ట‌. దీంతోపాటు మ‌రెన్నో విశేషాలు ఈ ఆల‌య చ‌రిత్ర‌లో దాగి ఉన్నాయి.
దేవాల‌యంలో ఉన్న హ‌వ‌న్ కుండ్ అనే ప్ర‌దేశంలో బ్ర‌హ్మ దేవుడి సాక్షిగా పార్వ‌తి, శివుడు ఒక‌ట‌య్యార‌ట‌. ఇదే ప్ర‌దేశాన్ని దంప‌తులు ద‌ర్శించుకుంటే వారి స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గిపోతాయ‌ట‌.
ఈ శివాల‌యంలో ఉన్న అఖండ్ ధుని అనే ప్ర‌దేశంలో ఎల్ల‌ప్పుడూ మంట యాగాగ్ని రూపంలో మండుతూనే ఉంటుంద‌ట‌. ఇక్క‌డే పార్వ‌తీ శివులు మంట చుట్టూ 7 అడుగులు న‌డిచార‌ని చెబుతారు. అందుకే ఈ దేవాల‌యానికి అఖండ్ ధుని ఆల‌యం అనే పేరు కూడా వ‌చ్చింద‌ట‌.
శివాల‌యంలోనే ఉన్న నీటి కొల‌నులో శివ పార్వ‌తుల క‌ల్యాణం త‌రువాత బ్ర‌హ్మ స్నానం చేశాడ‌ట‌. అందుకే ఈ కొల‌నుకి బ్ర‌హ్మ కుండ్ అనే పేరు వ‌చ్చింది. ఈ కొల‌నులో మునిగితే త‌మ పాపాలు తొల‌గిపోతాయ‌ని భ‌క్తులు న‌మ్ముతారు.

ఆల‌యంలోనే ఉన్న మ‌రో కొల‌నులో విష్ణువు స్నానం చేశాడ‌ట‌. ఈ క్ర‌మంలో ఆయ‌న పార్వ‌తీ దేవికి సోద‌రుడిగా వ్య‌వ‌హరించి అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేయ‌డంతోపాటు శివ పార్వ‌తుల క‌ల్యాణం కూడా జ‌రిపించాడ‌ట‌. అందుకే ఈ కొల‌నును విష్ణు కుండ్ అని వ్య‌వ‌హ‌రిస్తారు.
దేవాల‌యంలో ఉన్న మ‌రో నీటి కొల‌నులో శివుడు ఇత‌ర దేవ‌త‌ల‌తో క‌లిసి స్నానం చేశాడ‌ట‌. అందుకే దీన్ని రుద్ర కుండ్ అని పిలుస్తారు. శివుడు త‌న వివాహానికి ముందు ఇక్క‌డ స్నాన‌మాచ‌రించాడ‌ట‌. అయితే ఇక్క‌డ స్నానం చేసే దంప‌తుల‌కు సంతాన స‌మ‌స్య తొల‌గిపోతుంద‌ని విశ్వ‌సిస్తారు.

Popular Posts

Latest Posts