ఆఫీస్ లో బాస్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.. ఎలానో తెలుసా? ప్రతి మహిళా చూడాల్సిన వీడియో

బయటికొచ్చి పనిచేసే ఆడవాళ్ళంటే కొందరు మగ వారికి ఎక్కడలేని చులకన భావం. వాళ్ళని ఎమైనా కామెంట్‌ చేయొచ్చు, తిరిగి ఏమీ అనలేరు, ఎదురు మాట్లాడి పరువు పోగొట్టుకోరు.. ఇదీ వారి ఆలోచన. పని చేయాల్సిన అనివార్యత కొందరిది.. ఇలా జరుగుతోందని చెబితే ఇంట్లో ఉద్యోగం ఎక్కడ మానిపిస్తారో భయం ఇంకొందరిది. ఇదే అదునుగా మృగాళ్లు శృతిమించి ప్రయత్నించేందుకు కారణమవుతోంది. తమతో పాటు పనిచేస్తున్న ఆడవాళ్లను చూపులతోటే టీజ్ చేస్తుంటారు. వారి శరీర భాగాలను తదేకంగా చూస్తూ రాక్షసానందం పొందుతారు. ఇక వారి డ్రెస్‌ గురించి, శరీరం గురించి ఎగతాళి ధ్వనించేట్టు మాట్లాడుతుంటారు. అయితే, అటువంటి వారితో ఆమె దైర్యంగా నా శరీరంలో ఏం చూడాలనుకుంటున్నావు..? అని అందరి ముందు పెద్దగానే అడిగేసింది.
ఇక అంతే అతగాడు నిర్ఘాంతపోయాడు. ఆ ధైర్యం చేసింది ‘హర్‌ లెట్‌ ద వాయిస్‌ బి యువర్స్’ అన్న షార్ట్ ఫిల్మ్ లో మీనాక్షి. నాలుగు నిమిషాల నిడివి కూడా లేని, ఈ హిందీ షార్ట్ ఫిల్మ్ మహిళ దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. పని ప్రదేశాల్లో మగవాళ్ళ హెరాస్‌మెంట్‌ని మౌనంగా భరించే ఆడవాళ్ళు ఈ చిన్న వీడియోను చూస్తే తప్పకుండా ధైర్యం చేసుకుంటారు. వీడియో కోసం కింద క్లిక్ చేయండి…
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)