ఈ ఆకు కూర తింటే కనీ వినీ ఎరుగని ఆరోగ్య ప్రయోజనాలు

ప్రకృతిలో కొన్ని ఆహారపదార్థాలకు అద్భుతమైన మహత్తు ఉంది. మన శరీర ఆరోగ్యాన్ని నాలుగు కాలాల పాటు కాపాడే శక్తి ఉంది. అందరూ ఎంతగానో ఇష్టపడే గోంగూర రుచిలోనేగాక ఆరోగ్యపరంగా కూడా మహా శ్రేష్టమైంది. కప్పు తాజా గోంగూర రసంలో మనిషికి ఒక రోజుకి కావాల్సిన విటమిన్‌ సి 53 శాతం లభిస్తుంది. గోంగూరలో ఉండే పీచు పదార్ధం మన గుండెకు ఎంతో మేలుచేస్తుంది. దీనిలో ప్రోటీన్లు, కార్బోహైడ్రైట్లు అధికంగా ఉండి కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఆకులో పొటాషియం ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండటం వల్ల రక్త ప్రసరణ సక్రమంగా ఉండటమే కాకుండా మన శరీరంలోని రక్తపోటును కూడా అదుపులో ఉంచడానికి ఇది సహకరిస్తుంది. ఈ గోంగూరలో విటమిన్ ఎ అధికంగా ఉండటం వల్ల మన కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యల నుండి కూడా రక్షిస్తుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ గోంగూరలో అనేక దీర్ఘకాలిక రోగాలను నయం చేసే సత్తా ఉంది.
  • గోంగూరలో క్యాల్షియం, ఇనుము సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి రోజు వారీ ఆహారంలో గోంగూర ఉండేలా జాగ్రత్త పడితే ఎముకల ఆరోగ్యంగా పటిష్టంగా ఉంటాయి.
  • శరీరంలో రక్త ప్రసరణ సజావుగా సాగడానికి గోంగూర సహకరిస్తుంది. గోంగూరను ఏ రూపంలో తీసుకున్నా మంచిదే. కాబట్టి అప్పుడప్పుడు పిల్లలకు కూడా గోంగూర అలవాటు చేయడం మంచిది.
  • రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచి, షుగర్ లెవెల్స్ ని తగ్గించే శక్తి గోంగూరకు ఉంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు గోంగూరను ఆహారంలో చేర్చుకోవడం వల్ల షుగర్ వ్యాధిని నియంత్రిస్తుంది.
  • గోంగూరలో ఫోలిక్ యాసిడ్స్, మినరల్స్ అత్యధికంగా ఉంటాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. గుండె, కిడ్నీ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులను నివారించడానికి గోంగూర సహాయపడుతుంది.
  • దగ్గు, ఆయాసం, తుమ్ములతో ఇబ్బంది పడేవాళ్లు గోంగూరను ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటే సహజ ఔషధంలా పనిచేస్తుంది.
  • గోంగూరలో యాంటీ యాక్సిడెంట్లు సమపాళ్లలో ఉన్నందున చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. తద్వార రక్తపోటు అదుపులో ఉంటుంది.
  • గోంగూరని క్రమంగా వాడితే రక్తహీనత, నిద్రలేమి, అధిక రక్తపోటు తగ్గిపోతుంది. ప్రతి రాత్రి నిద్రకు ముందు కప్పు గోంగూర రసం తాగితే మంచి నిద్ర పడుతుంది.
  • గోంగూర ఆకుల పేస్ట్‌ తలకు పట్టించి, ఉదయం స్నానం చేస్తే వెంట్రుకలు ఊడడం తగ్గి బట్టతల రాకుండా కాపాడుతుంది. గోంగూరలోని క్యాల్షియం ఎముకల సమస్యలకు మంచి ఫలితం ఇస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
  • ఒక్కమాటలో చెప్పాలి అంటే ఈ గోంగూర ఆకు మన ఆరోగ్యానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అందుకే వారానికి ఒకసారి అయినా గోంగూర కూర తినాలి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)