పరగడుపున ఈ ఒక్కటి తింటే గ్యాస్ ట్రబుల్ మాయం

Loading...
కడుపు ఉబ్బరం, పొట్ట నొప్పి, బ్రేవ్ బ్రేవ్ మంటూ తేన్పులు కలిగించే అసౌకర్యం అంతా ఇంతా కాదు. ఒక్కసారి కడుపులో అలజడి మొదలైందంటే కూర్చున్నచోట కూర్చోలేని పరిస్థితి. చికాకు, కోపం ఇవన్నీ గ్యాస్ ట్రబుల్ లక్షణాలే. గ్యాస్టిక్ సమస్యను అదిగమించేందుకు ఆయుర్వేదం చక్కని పరిష్కారాన్ని చూపిస్తోంది. ఈ సమస్యను అధిగమించాలంటే ఇలా చేయండి.
  • శొంఠి చూర్ణంతో పాత బెల్లం సమంగా కలిపి ప్రతిరోజూ ఉదయాన్నే తిని ఆ తర్వాత వేడి నీళ్లు తాగితే కడుపులో వున్న గ్యాస్ సమస్య పోతుంది.
  • ధనియాలు, శొంఠి సమభాగాలు చూర్ణం చేసి కలిపి ఒక టీ స్పూన్ ప్రతిరోజూ ఉదయం, రాత్రి భోజనం తర్వాత వేడి నీటితో తీసుకుంటే కడుపులో చెడుగాలి పోయి సాఫీగా విరేచనం అవుతుంది.
  • అల్లం రసం పొంగించి దానిలో బెల్లం పొడి కొద్దిగా కలిపి ఒక టేబుల్ స్పూన్ తాగితే కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
ఈ నియమాలు పాటించాలి:
1. మానసిక ఒత్తిడిని నివారించడానికి ధ్యానం, యోగా నిత్యం చేయాలి.
2. ప్రతిరోజూ విధిగా వ్యాయామం చేయాలి.
3. పీచు పదార్థాలు ఎక్కువగా వున్న తాజా కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
4. టీ, కాఫీలు మానేయాలి లేదా తగ్గించాలి.
5. మసాలాలు, వేపుళ్లు, ఆయిల్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఆల్కహాల్, స్మోకింగ్ మానివేయాలి.
6. వేళకు ఆహారం తీసుకుంటూ నీళ్లు సరిపడినంత తాగాలి.
7. నిల్వ వుంచిన పచ్చళ్లు తినడం మానేయాలి.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...