ఏ నెంబర్ కి సంబంధించిన కాల్ హిస్టరీ అయినా ఒక్క నిమిషంలో తెలుసుకోవచ్చిలా

టెలీ కమ్యూనికేషన్ వ్యక్తుల సంబంధాలను ఎంతగా సులువు చేసిందో అంతకంటే ఎక్కువ చెడుకూ దారితీస్తోంది. అసలు మన దేశంలో అనేక నేరాలు, ఘోరాలు వెలుగు చూస్తున్నదే అత్యధికం ఫోన్ కాల్ డేటా ఆధారంగా.. అంటే మంచి పనే కాదు చెడు పనులకూ చేతిలోకి వచ్చిన సెల్ ఫోన్ ఉపయోగపడుతోందన్నమాట. అందుకే పిల్లల సెల్ ఫోన్ వాడకంపై ఓ కన్నేసి ఉంచకపోతే చేయి దాటిపోయిన తర్వాత ఎంత బాధ పడినా ఫలితం ఉండదు. ఎందుకంటే ఈరోజుల్లో పిల్లలు బయట ఏమేమి చేస్తున్నారో ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నారో, తద్వారా ఎటువంటి కార్యకలాపాలకు ప్లాన్ చేస్తున్నారో తెలియదు. తీర చేయిదాటిపోయాక అన్ని ఆలోచిస్తారు పేరెంట్స్ .అయితే ఇలా మీ పిల్లల మీద ఎమైనా డౌట్ వచ్చి వారి కాల్ హిస్టరీ ని చెక్ చేయాలి వారు ఎవరెవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోవాలంటే ఆ మొబైల్ నంబర్ ఎవరి ఫోన్ లో ఉందో ఆ మొబైల్ ఇమెయిల్ id కి కాల్ హిస్టరీ వస్తుంది ఎలానో ఏమిటో ఇప్పుడు చుద్దాం..

మొబైల్ లోని ప్లే స్టోర్ లోకి వెళ్లి మొబిల్ అనే యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవాలి .ఇప్పుడు యాప్ ఒపెన్ చూసినప్పుడు లాంగ్వేజ్ ఇంగ్లిష్ అని సెలెక్ట్ చేసుకోవాలి .ఆ తరువాత వచ్చే అప్షన్స్ అన్నీటికి అలో బటన్ ను సెలెక్టు చేసుకోవాలి .అక్కడ మొబైల్ నంబర్ అడుగుతుంది అయితే ఆ మొబైల్ లో ఉన్న నంబర్ మాత్రమే ఇవ్వాలి .అప్పుడు ఆ మొబిల్ కి ఓటీపీ నంబర్ వస్తుంది అది ఆటోమేటిక్ గా వెరిఫై చేసుకుంటుంది. వెరిఫికేషన్ తరువాత గివ్ పర్మిషన్ అని వస్తుంది. అది ఓకే చేయాలి. అప్పుడు ఆ మొబైలులో ఏ ఏ నెట్వర్క్ సిమ్స్ ఉన్నాయో అక్కడ చూపిస్తుంది. మనం తెలుసుకోవాల్సిన కాల్ హిస్టరీ సిమ్ ని సెలెక్టు చేసుకోవాలి. తరువాత..

రైట్ సైడ్ లో కింద బిల్ కాల్ డీటైల్స్ అనే అప్షన్స్ వస్తాయి దాంట్లోనుంచి బిల్ అప్షన్ ను సెలెక్టు చూసుకోవాలి. అక్కడ మళ్ళీ కొన్ని అప్షన్స్ వస్తాయి. చివరి 30 రోజులు, చివరి 7 రోజుల హిస్టరీ లేదా సెలక్ట్ డేట్ అని వీటిలోనుంచి ఎదైనా ఒక అప్షన్ సెలక్ట్ చేసుకుని గెట్ బిల్ బై ఇమెయిల్ అప్షన్ పై టాప్ చెయ్యాలి. కొద్దిసేపటికి కాల్ హిస్టరీ ని ఇమెయిల్ కు సెండ్ చేసినట్లు మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఆ ఫోన్ లో మెయిల్ చెక్ చూసుకుంటే మనకి అక్కడ మనం ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్నన్ని రోజుల కాల్ హిస్టరీ వస్తుంది. ఇలా కాల్ హిస్టరీ ని తెలుసుకోవచ్చు. కానీ ఇది మంచిపనులకు మాత్రమే ఉపయోగించాలి మిస్ యూస్ చేయకూడదు. దీనిని మరింతగా స్పష్టంగా తెలుసుకునేందుకు కింది వీడియో క్లిక్ చేయండి..
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)