సమాధి లో నుంచి తమ్ముడికి ఫోన్ చేసాడు ఆ తరువాత ?

ఒక వ్యక్తి తమ వద్ద తీసుకున్న అప్పు చెల్లించండం లేదని అప్పు ఇచ్చినవారు తీవ్ర కోపానికి గురై బతికుండగానే ఆ వ్యక్తిని సమాధి చేసేశారు. అయితే ఎవరూ ఉహించని విధంగా ఆ వ్యక్తినుండి ఫోన్ కాల్ వచ్చింది ఎలానో ఏమి జరిగిందో ఇప్పుడు చుద్దాం. రష్యా రాజధాని మాస్కో నగరంలో కిక్మెట్ ఒక వ్యాపారవేత్త. వ్యాపారంలో బాగ నష్టాలు రావడంతో అనేక అప్పులు చేసి తీర్చలేకపోయాడు. దీంతో అప్పులు ఇచ్చినవారు అడిగి అడిగి విసిగి ఓపిక నశించి చివరకి అతణ్ణి చంపేయాలనుకున్నారు.
అయితే అతణ్ణి బాగా కొట్టి స్పృహ కోల్పోయే విధంగా చేసి బ్రతికుండగానే సమాధిలో పూడ్చేశారు. అయితే అతణ్ణి సమాధిలో పూడ్చిపెట్టే సమయంలో అతని జేబులో సెల్ ఫోన్ ఉంది గమనించలేదు. అలానే పాతిపెట్టి వెళ్లిపోయారు. ఆ తరువాత కిక్మెట్ తన సెల్ తో తన తమ్ముడికి ఫొన్ చేసి విషయం చెప్పాడు కానీ ఆ సమాధి ఎక్కడ ఉందో ఇద్దరికీ తెలియదు. అయితే కిక్మెట్ తమ్ముడు అతణ్ణి కొట్టినవారి దగ్గరికి వెళ్లి ఎక్కడ పాతిపెట్టారో చెప్పమని అడుగగా వారు అతని అప్పు చెల్లిస్తేనే చెప్తామని తెగించి చెప్పేసారు.
దీంతొ కిక్మెట్ తమ్ముడు ఇస్మాయిల్ కొంత చెల్లించడంతో వారు ఆ సమాది ఎక్కడ ఉందో చెప్పాడు. వెంటనే సమాధిదగ్గరకు వెళ్లి తన అన్నను వెలికితీసి హాస్పిటల్ లో చేర్పించి తన అన్నను బ్రతికించుకున్నాడు. అందుకే అప్పు ముప్పనీ అప్పు చేసి పప్పు కూడు తినొద్దని మన పెద్దలు అంటూ ఉంటారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)