రూపాయి కోసం బట్టలుతుకినవాడు ! ఇప్పుడు మహేష్ బాబును కూడ Q లో ఉంచాడు

జీవితం లో ఎన్నో ఎత్తు పల్లాలు చూసి చూసి జీవితం లో ఊహించని ఎత్తుకు ఎదిగిన వాడె ముర్గదాస్. తన పిల్లలు ఎదిగితే చూసుకోవాలని పరితపించి పోయేది ముర్గాదాస్ తల్లి అరుణాచలం. చిన్న తనం నుండి కనపడిన పేపర్ అయినా పుస్తకం అయినా చదివి అవతల పారేయడం అలవాటు. దొంగ తనంగా సినిమాలు చూసివచ్చేవాడు ముర్గాదాస్ డిగ్రీ వచ్చేటప్పటికి సినిమాల్లో ప్రయత్నిస్తానని చెప్పి చెన్నై వచ్చాడు. 
ఎన్నో ఆశలతో అడుగు పెట్టినప్పుడి నుండి కష్టాలే మారు మూలా పల్లెనుండి వచ్చిన ముర్గదాస్ కి ఓ చిన్న గది కొన్నాళ్ళు ఇంటి దగ్గరి నుండి వచ్చే 500 రూపాయలతో ఓ పూట తిని రెండు రోజులు పస్తు పడుకోవలసిన పరిస్థితి. ఇంటి దగ్గర అడగలేని పరిస్థితి ఇంటి దగ్గర ఇదే స్థితి అప్పటికే ఇంటి అద్దె కట్టి ఆరు నెలలు దాటింది.
తన రూమ్ మెట్ ఒక సారి డజన్ల కొద్ది బట్టలు ఉతుకుతు కనిపించాడు.. ఏంటి విషయం అని ఆరాతిస్తే వుతికిచ్చినందుకు ఓ చొక్కాకు 1 రూపాయి ఇస్తారు అని చెప్పాడు స్నేహితుడు. అవసరం ఆకలి బట్టలుతికే పనికి కూడా వెనుకాడనీయలేదు. ఒకరు బ్రెష్ కొడితే ఒకరు జాడింఛి బట్టలు ఆరేస్తు వచ్చిన డబ్బులతో కడుపు నింపుకుంటున్నాడు. ఓ రోజు ఇంటి ఓనర్ పైకొచ్చి ఏం బ్రతుకురా ఏం చేద్దామని వచ్చి ఏం చేస్తున్నారు అని చెడ మడ తిట్టేసాడు. మురుగదాస్ ని వెంటనే ఛి ఇల్లు ఖాళిచేసి మీవూరు వెళ్ళిపో అని తోసేసాడు. ముర్గదాస్ కన్నీళ్ళు కారుస్తూ నిలబడడం చూసి అమాంతం కౌగిలించుకొని ఇంకో ఆరు నెలలు ఇంటి అద్దె అడగను నువ్వు దయచేసి ఇలాంటి పనులు మాత్రం చేయవద్దు అని సపోర్ట్ చేసాడు ఓనర్.
ఇక ఆ తరువాత అమృతం అనే రైటర్ దగ్గర చేరాడు వూరు పేరు లేని సినిమాలు లెక్క లేనన్ని చేసారు ఇంతలో పిడుగు లాంటి వార్త తండ్రి చనిపోయాడని. కనీసం ఆఖరి చూపుకు కూడా నోచుకోలేక పోయాడు ముర్గదాస్. తాను ఎప్పుడు నిరుత్సాహపడిన ఉత్తేజాన్ని నింపే తండ్రి కోరిక నెరవేర్చాలని కోరిక స్పూర్తిగా మారిందంటాడు ముర్గాదాస్. 
ఆ తరువాత SJ సూర్య దగ్గర "వాలి" చేసిన తరువాత అజిత్ తో స్నేహం ఏర్పడింది. దాంతో ఓ సినిమా తీసాడు ఓకే అనిపించుకున్నాడు కానీ తమిళ్లో విజయ్ కాంత్ తో తీసిన రమణ సినిమా ఓ ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది ఇక ఆ తరువాత గజినీ కోసం అజిత్ ని సంప్రదిస్తే డేట్స్ కలవలేదు దాంతో సూర్యని కలవడం ఓకే అవడం ఆ సినిమా అమీర్ ఖాన్ కి విపరీతంగా నచ్చేయడం తో అది బాలివుడ్ కి వెళ్ళింది. 
ఆ సినిమాను ప్రత్యేకంగా చూడాలనే కోరికతో ముకేష్ అంబానీ స్పెషల్ గా షో వేయించుకున్నాడు. సినిమా చూసిన నీతు అంబానీ కంట తడి పెట్టుకుంది. ముర్గదాస్ ని ఆ అంబానీ దంపతులు డైనింగ్ టేబుల్ కి ఆహ్వానించి కలిసి డిన్నర్ చేసారు. కుటుంబం బాగోగుల గురించి అడిగి చెప్పలేనంత ఆప్యాయత చూపించారు ఇవన్ని తెలుసుకుంటే నిజంగా ఓ కలలా అనిపిస్తుంది కానీ బాధల్ల ఏంటంటే కొడుకు కోసం పరితపించి పోయిన ఆ తండ్రి తన ఎదుగుదల చూడలేక పోయాడని ఒక బాధ వుంటుంది.
దేశం గర్వంగా చెప్పుకునే దక్షణాది దర్శకుల్లో ఒకరు ముర్గదాస్ అతని కోసం ఎంతో మంది గొప్ప గొప్ప స్టార్స్ వెయిట్ చేస్తున్నారు. మన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా 3 సంవత్సరాలు వెయిట్ చేస్తే spyder సినిమా ఓకే అయింది. ఇది ముర్గదాస్ జీవితం.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)