కేవలం ఐదు రోజులు మాత్రమే ఈ గుడి తెరిచివుంటుంది.. ఈ యాత్ర చేయాలంటే ఎంతో ధైర్యం, అదృష్టం ఉండాలి.. ఇది మన తెలుగు రాష్ట్రమే

ప్రకృతి రమణీయతతో అలరారుతున్న దట్టమైన అడవి ఎతైన కొండలు పాల నురగలా జాలువారే జలపాతం. ప్రకృతి అందాలోతో పాటు ఎంతో చారిత్రాత్మక నేపధ్యం కలిగిఉన్న సలేశ్వర క్షేత్రం. ఈ క్షేత్ర విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇది తెలంగాణలో మెహబూబ్ నగర్ జిల్లా నల్లమల అడవుల్లో కొలువైవుంది సలేశ్వర క్షేత్రం. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే మార్గంలో నూట యాభై కిలోమీటర్ల మైలు రాయి దగ్గర ఫరహాబాద్ గేట్ ఉంటుంది. అక్కడ నుండి ముప్పై రెండు కిలోమీటర్లు దట్టమైన అడవిలోకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి అనుమతితో వెళ్ళవచ్చు. పది కిలోమీటర్లు వెళ్ళగానే రోడ్డుకు ఎడమపక్కన నిజాం కాలపు శిధిలావస్థలో ఉన్న భవనాలు కనిపిస్తాయి. నిజాం రాజు అక్కడి ప్రకృతి అందాలను చల్లదనానికి ముగ్ధుడై వందేళ్లకు ముందే అక్కడి వేసవి విడిదిని నిర్మించుకున్నాడు. అందుకే ఆ ప్రదేశాన్ని ఫరహాబాద్ అంటారు. అంటే అందమైన ప్రదేశం అని పేరు వచ్చింది.
అంతకు ముందు ఇక్కడ పులులు ఎక్కువగా సంచరించేవి కాబట్టి కేంద్ర ప్రభుత్వం 1973లో టైగర్ ప్రాజెక్ట్ పేరిట పులుల సంరక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది మనదేశం లోనే అతిపెద్ద పులుల సంరక్షణా కేంద్రం. టైగర్ సఫారీ పేరిట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నల్లమల అడవుల్లో స్వేచ్ఛగా తిరుగాడే జంతువులను, పులులను, పర్యాటకులకు చూపిస్తారు.
సలేశ్వరానికి మూడు నడక దారులు ఉన్నాయి ఒకటి మనన్నోరు నుంచి, రెండవది బలమోరు మండలం దవాగు నుంచి, మూడవది లింగాల నుంచి నడక సాగిస్తూ భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటారు. దట్టమైన నల్లమల అడవిలో ఉన్నందున అనాదిగా ఇక్కడ పూజా కార్యక్రమాలు చెంచులే నిర్వహిస్తున్నారు. దేవాలయా నిర్వాహణ తమ భాద్యతగా భావిస్తారు. జాతరకు పదిహేను రోజులముందు నుంచి ఏర్పాటులలో నిమగ్నమౌతారు. సలేశ్వరం జాతర సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది.
చైత్ర పౌర్ణమికి రెండురోజుల ముందు రెండు రోజుల వెనుక మొత్తం ఐదు రోజులు మాత్రమే జరుగుతుంది. సలేశ్వరం యాత్ర భక్తితో కూడుకున్నా సాహసయాత్రే.. ! దట్టమైన అడవిలో ఎతైన కొండలలో ప్రకృతి అందాల మధ్య సాగుతుంది సలేశ్వరయాత్ర. కాలిబాటన వచ్చే భక్తులను ప్రకృతి అందాలు అడుగడుగునా కట్టిపడేస్తాయి. ఇరుకైన లోయల్లో జాగ్రత్తగా నడవాలి కొన్ని చోట్ల కేవలం బెత్తెడు దారి నుంచి నడవాల్సి ఉంటుంది. అక్కడినుంచి జారితే శివైక్యం చెందవలసిందే మండు వేసవిలో జాలువారే జలపాతాలు ఎంతో అందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. నీటి గుండాలు ఎంతో ఆకట్టుకుంటాయి కష్టమైనా ఇష్టాంగా సలేశ్వరం చేరుకొని మొక్కులు తీర్చుకుంటారు భక్తులు.
శ్రీశైలం మల్లిఖార్జున స్వామీ, సలేశ్వర లింగమయ్య స్వామీ, లుద్దీ మల్లన్న, ఉమామహేశ్వరం ఈ నాలుగు లింగాలే అందరికి తెలిసినవి. ఆ ఐదో లింగం నల్లమల అడవుల్లో ఎక్కడ ఉందొ ఇప్పటికి రహస్యమే. నల్లమలలో ఉన్న పలుక్షేత్రాల పై ఆయా ప్రాంతాలలో నివసించే చెంచులకే అధికారం ఉంటుంది. ప్రతి సంవత్సరం చైత్ర పున్నమినాడు మాత్రమే ఈ సలేశ్వర ఉత్సవము జరుగుతుంది. ఈ ఉత్సవం చెంచుల ఆధ్వర్యంలో మాత్రమే జరుగుతుంది. ఈ ఆలయానికి ఘనమైన చరిత్ర కలదు. ఆరు, ఏడు శతాబ్దాలకు చెందినదిగా చరిత్రకారులు భావిస్తూ పదమూడో శతాబ్దంలోని మల్లిఖార్జున పండితారాధ్య చరిత్రా, శ్రీపర్వత క్షేత్రంలో సలేశ్వర క్షేత్ర విశేషాలు పాల్కురి సోమనాధుడు వర్ణించాడు. ఇక్కడ పదిహేడవ శతాబ్దం చివరలో ఛత్రపతి శివాజీ కూడా ఇక్కడ ఆశ్రయం పొందినట్లు చరిత్ర చెబుతుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)