ఎలాంటి కెమికల్స్ వాడకుండా నల్లటి మెడను తెల్లగా మార్చుకోండి

ఎలాంటి కెమికల్స్ వాడకుండా మన ఇంట్లో లభించే పదార్దాలు ఉపయోగించి మీ నల్లటి మెడను తెల్లగా ఎలా మార్చుకోవచ్చో మనం ఇప్పుడు చూద్దాం.
ముందుగా పచ్చిపాలలో ఒక కాటన్ ను తీసుకొని ముంచి దానిని మెడ చుట్టూ అప్లై చేయాలి ఆ తరువాత ఒక రెండు నిమిషాల పాటు సర్కులర్ మోషన్ లో బాగా మస్సాజ్ చేయాలి ఇలా చేయడం వలన మెడపై పేరుకున్న దుమ్ము దూళి తొలగిపోతుంది. తరువాత స్మూత్ కాటన్ తో మెడను తుడుచుకోవడం వలన మృతకణాలు తొలగిపోతాయి.
ఇప్పుడు గోరువెచ్చని నీటిలో టవల్ ను ముంచి దాన్ని పిండి ఆ టవల్ ను మెడపై ఒక రెండు మూడు నిమిషాలపాటు ఉంచడం వలన చెర్మం లోని స్వేదరంధ్రాలు తెరుచుకొని మృతకణాలు తొలగిపోయి మెడ కాంతివంతంగా నీట్ గా అవుతుంది ఇప్పుడు ఒక టవల్ తో మెడను తుడుచుకోవాలి ఏదైనా ప్యాక్ వేసుకునే ముందు ఇలా నీట్ గా క్లీన్ చేసుకోవాలి 
తరువాత కొంచెం పంచదార తీసుకుని దానిలో ఒక నిమ్మచెక్క అద్దుకుని మెడపై స్క్రబ్బింగ్ చేస్తూ ఉండాలి. ఇది ఒక బ్లీచింగ్ గా పనిచేస్తుంది. ఇంకా మృతకణాలను కూడా తొలగిస్తుంది.తరువాత టవల్ తో నీట్ గ తుడుచుకోవాలి.
ఇప్పుడు ఐదు టీ స్పూన్స్ శనిగపిండి లేదా సున్నిపిండి ఒక బౌల్లో తీసుకుని దానికి మూడు స్పూన్స్ పచ్చిపాలు ఒక స్పూన్ తేనె, నాలుగు చుక్కలు నిమ్మరసం వేసి పేస్ట్ తయారు చేసుకొని మెడపై అప్ప్లై చేయాలి. ఇది బాగా డ్రై అయిన తరువాత పచ్చిపాలతో మసాజ్ చేసి ఆరిన తరువాత చల్లటి నీళ్లతో కడగాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయడం వలన మెడను తెల్లగా కాంతివంతంగా మృదువుగా మార్చుకోవచ్చు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)