ముందు అన్న అని రాఖి కట్టింది కాని అయిన్నే పెళ్లి చేసుకుంది

ఎవర్ గ్రీన్ అతి లోక సుందరిగా శ్రీదేవి నాటి నుండి మేటినటిగా స్థిర స్థాయి ని అందుకుంది. తెలుగు తో పాటు తమిళం హిందీ బాషల్లో తనదైన ముద్ర వేసుకుందనే చెప్పాలి. ఇది నాణానికి ఒక వైపు ఐతే తన వ్యక్తి గత జీవితం కొంత బిన్నంగా మలచబడిందని చెప్పవచ్చు. శ్రీదేవి బోని కపుర్ని పెళ్లి చేసుకోవడం వెనుక లోగుట్టు దాని అంతరార్దం ఏమిటో బహుషా అందరికి తెలుసు శ్రీదేవి జీవితం తెరిచిన పుస్తకం వంటిది. కానీ బోనికపూర్ కంటే ముందే శ్రీదేవి కి పెళ్లి జరిగిన విషయం ఎంత మందికి తెలుసు. ఆ విషయమే ఇప్పుడు చూద్దాం ఇక వివరాల్లో కెళితే శ్రీదేవి మొదటి పెళ్లి 1985 లో ఒకప్పటి బాలివుడ్ హీరో మీదున్ చక్ర వర్తి తో అయింది.
సినిమాల్లో నటిస్తున్న సమయం లో శ్రీదేవితో లవ్ ఎఫెర్ నడిపాడు మిదున్ మరో వైపు మిదున్ చక్రవర్తి కి శ్రీదేవి కంటే ముందే యోగిత అనే ఆమెతో పెళ్లి అయింది. అయినా శ్రీదేవితో అయన కొన్నాళ్ళు కలిసి వున్నారు. ప్రేమలో పడ్డ తొలి నాళ్లలో శ్రీదేవి యోగితను వదిలి తనతోనే ఉండమని ఆడర్ వేసిందట అలా అన్నందుకు రహస్యంగా శ్రీదేవిని పెళ్ళిచేసుకున్నాడు.  మిదున్ మాత్రం తన మొదటి భార్య యోగితను వదల్లేక పోయాడు ఆమె మీద బెంగతో బాధపడి చివరికి మళ్ళి ఆమెకే దగ్గరయ్యాడు.
దాంతో ఇద్దరి మద్య గొడవలు వచ్చి విడిపోయారు నిజానికి వీరి మద్య గొడవలను బోనికపూర్ ఎప్పుడు ఓ కంట కనిపెడుతూ ఉండేవాడు ఇందులో మరో ఇంటరెస్టింగ్ పాయింట్ ఏంటంటే   మిదున్ తో గొడవైన ప్రతి సారి శ్రీదేవి వచ్చి బోనికపూర్ తో చెప్పేది. ఇది ఇలా వుండగా మిదున్ ఇంట్లో లేనప్పుడు బోనికపూర్ శ్రీదేవితో మాట్లాడం ఇంటికి వచ్చి కలవడం చూసి తట్టుకోలేక పోయాడు మిదున్. చివరికి దీనికి ఎండ్ చెప్పాలని బావించి శ్రీదేవిని బోని కపూర్ కి రాకీ కట్టి అన్నగా స్వికరించమన్నాడు మిదున్. ఇంకేముంది శ్రీదేవి రాఖి  కట్టేసింది కానీ అనుమానాలతో మిదున్ తో గొడవలు మరి ఎక్కువవడం తో శ్రీదేవి బోనికపూర్ కి దగ్గరైంది. చివరికి ఎటూ పోలేక బోనీ కపూర్ ని పెళ్లి చేసుకుంది. ఇక చివరి ట్విస్ట్ ఏంటంటే బోనికపూర్ కి కూడా ఇది రెండో పెళ్లి. అలా ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో సాగింది ఈ అతిలోక సుందరి జీవితం.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)