భర్త చనిపోయిన మూడేళ్ళ తర్వాత.. ఆయన ప్రతిరూపానికి జన్మనిచ్చిన పోలీసాఫీసర్ భార్య

2014లో న్యూయార్క్ పోలీస్ డిపార్టుమెంట్ అధికారి హత్యకు గురయ్యాడు. ఆయనకు గుర్తుగా భార్య 2017 లో అంటే మూడేళ్ళ తరువాత.. అతని ద్వారా బిడ్డకు తల్లి అయింది. ఈ ఘటన న్యూయార్క్‌లో చోటుచేసుకుంది. ప్రపంచ వైద్య శాస్త్రంలో నే ఈ ఘటనను ఓ అరుదైన ఘటనగా నమోదైంది. వివరాలిలా ఉన్నాయి.. డిసెంబర్ 2014లో న్యూయార్క్ పోలీసు అధికారి వెంజియాన్ లియూ పెట్రోలింగ్ కారులో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో దుండగుల చేతిలో లియూ హత్యకు గురయ్యారు. తొలి ఆసియా అమెరికన్ పోలీస్ అఫీసర్‌గా లియో రికార్డు సొంతం చేసుకున్నాడు. ఆయన మరణం భార్యను ఎంతగానే వేదనకు గురిచేసింది. ప్రేమా ఆప్యాయతలు పంచిన భాగస్వామి అర్థాంతరంగా ఈ లోకం విడిచి వెళ్లడం ఆమెను నిర్ఘాంతపర్చింది. ఇక అతని సహచర్యం ఉండదని తెలిసి కుమిలి పోయింది. భౌతికంగా ఆయన తనతో ఉండక పోయినా.. తన తుది శ్వాస వరకు తనతో ఆయన ప్రేమకు ప్రతిరూపం ఉండాలని భావించింది.లియూ మృతదేహం ఆస్పత్రిలో ఉన్న సమయంలో అతని వీర్యకణాలను తీసి భద్రపరచాలని భార్య పియాక్సియాచెన్ వైద్యులను కోరింది. ఆమె విజ్ఞప్తి మేరకు మృతదేహం నుంచి వీర్యాన్ని సేకరించిన డాక్టర్లు భద్రపరిచారు. దాదాపు  సంవత్సరాల తరువాత, ఆమె అదే వీర్యంతో కృత్రిమ గర్భదారణ పద్ధతులను అనుసరించి గర్భం దాల్చింది. తాజాగా అంటే ఆయన చనిపోయిన మూడేళ్ళ తరువాత, న్యూయార్క్ ప్రెస్బిటేరియన్ హాస్పిటల్‌లో పండంటి పాపకు జన్మనిచ్చింది. దీనిపై లియూ తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తన కుమారుడిని కోల్పోయిన బాధలో ఉన్న తమకు.. మనవరాలు పుట్టడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పారు. లియూ లేని మూడేళ్లు తమకు చీకట్లో బతుకుతున్నట్లుగా ఉందని విలపించారు. ఈ క్రమంలో తమ కోడలు పండంటి పాపాయిని తమ చేతుల్లో పెట్టిందని చెప్పుకొచ్చారు. ఇకపోతే..ఆసియా అమెరికన్లలో మొదటి పోలీసు అధికారి కావడంతో ఆయన అంత్యక్రియలకు వేలాది మంది పోలీసులు, ప్రవాస ఆసియా వాసులు హాజరయ్యారు. తాజాగా లియూ కుమార్తె పోలీస్ టోపీని ధరించిన ఫోటోను న్యూయార్క్ పోలీసు శాఖ విడుదల చేసింది. జూనియర్ లియూ పుట్టిందని సోషల్ మీడియాలో ఫోటోలు విడుదల చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ట్రెండ్ గా మారుతున్నాయి. సంతానం అనేది ఏ దేశం లోనైనా ప్రతి స్త్రీ కి ఒక ఆత్మీయతను, పరిపూర్ణత ను ఇస్తుంది. భర్త అకాల మరణంతో ఆమెకు ఆ కోరిక తీరకుండా పోతుందనే బాధ లేకుండా.. తుది ఘడియల్లో ఆమె చేసిన ఆలోచన సత్పలితాన్నించింది. అంతేకాదు భవిష్యత్ లోనూ ఇలా విధి వంచించి కాలం చేసిన భర్తకు గుర్తుగా భార్య బిడ్డను కనే అవకాశం ఉందనే దారి కూడా చూపించి మార్గదర్శిగా నిలిచింది. కొండంత అండ అయిన భర్త తనతో లేకపోయినా మనోబలాన్ని వదులుకోకుండా తన గమ్యాన్ని చేరుకుంది ఆమె భర్త అంశను తన కడుపులో మోసి చివరికి తన భర్త ను ఆ పాప రూపం లో తిరిగి పొందగలిగింది హ్యాట్స్ ఆఫ్ టూ పియాక్సియాచెన్… అంటోంది ఇప్పుడు ప్రంపంచం. ఆ అరుదైన అమ్మకు మనమూ చెబుదాం ఓ సెల్యూట్.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)