మీరు ఫోన్ కొన్నప్పటి నుంచి డిలీట్ చేసిన వీడియోలు, ఫొటోలు సింపుల్ గా ఇలా పొందొచ్చు

టెక్నాలజీ పెరిగిన తర్వాత విజువల్ కి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ప్రతి విషయంలోనూ ఇమేజ్, వీడియో తప్పనిసరి ఎవిడెన్స్ అవుతోంది. అనేక స్వీట్ మెమోరీస్ ఇప్పుడు సింపుల్ గా విజువలైజ్ చేసుకుని పెట్టుకోవడానికి ఎంచక్కా చేతిలోకే స్మార్ట్ ఫోన్ వచ్చింది. అయితే ఫోన్ లో స్పేస్ సరిపోవడం లేదనో లేక పొరపాటున్నో కొన్ని ఫొటోలు, వీడియోలు డిలీట్ చేస్తుంటాం. కొద్ది రోజుల తర్వాత వాటితో చాలా ఇంపార్టెంట్ పని పడొచ్చు. లేకపోతే అనవసరంగా డిలీట్ చేశామని మనకే బాధ కలగొచ్చు. ఇక చిన్న పిల్లల చేతికి ఫోన్ పోతే కూడా వాళ్లు ఏది పడితే అది నొక్కిన ఫలితంగా గ్యాలరీలో అనేకం డిలీట్ అయిపోతుంటాయి. పుట్టినరోజు ఫొటోస్, పెళ్లిరోజు, టూరిస్ట్ ప్లేసుల్లో దిగిన ఫొటోలు.. ఇలా అత్యంత అమూల్యమైన, కలకాలం గుర్తుండిపోయే మెమోరీస్ ఎగిరిపోతే.. అదే ఫోన్ లో తిరిగి పొందొచ్చని చాలా మందికి తెలియదు. ఇందుకోసం ఏం చేయాలో చూడండి
దీనికోసం ప్లే స్టోర్ లోకి వెళ్లి “డిస్క్ డిగ్గర్” అని సెర్చ్ బాక్స్ లో టైప్ చేస్తే అప్పుడు మీకు ఆరంజ్ రంగు లో ఒక యాప్ కనిపిస్తుంది. దానిని డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవాలి.

ఓపెన్ చేసిన తర్వాత అందులో పాప్ అప్స్ లాంటివి వస్తే నెక్ట్స్ బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఆ యాప్ మీకు డిలీట్ అయిన ఫొటోస్ కావాలా లేదంటే వీడియోస్ కావాలా అని అడుగుతుంది. మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి.
అప్పుడు స్టార్ట్ బటన్ నొక్కితే మీ డిలీట్ అయిన ఫొటోస్ కనిపిస్తాయి. అప్పుడు ఆ ఫోటో క్లిక్ చేసి మీ డివైస్ లో సేవ్ చేసుకుంటే సరిపోతుంది.
మరింత స్పష్టంగా ఈజీగా తెలుసుకోవాలంటే కింది వీడియో క్లిక్ చేయండి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)