ఫోర్డ్ చేసిన అవమానానికి రతన్ టాటా ఇలా ప్రతీకారం తీర్చుకున్నాడు

 • "మీకు కార్లు గురించే తెలియదు, అలాంటప్పుడు ప్యాసింజర్ కార్ల డివిజన్‌లోకి ఎందుకు ప్రవేశించారు ?" అని ఫోర్డ్ రతన్ టాటా గారిని ప్రశ్నించింది. సరిగ్గా తొమ్మిది సంవత్సరాల అనంతరం అమెరికాకు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీని రతన్ టాటా పూర్తిగా కొనేశాడు.
 • ఫోర్డ్ మీద రతన్ టాటా రివెంజ్ ఏమిటి ? 1998 లో టాటా మోటార్స్ ఇండికా హ్యాచ్‌బ్యాక్ కారుతో ఇండియన్ ప్యాసింజర్ కార్ల మార్కెట్లోకి ప్రవేశించింది. తొలికారుతోనే టాటా ప్యాసింజర్ కార్స్ విభాగం అపజయాన్ని రుచిచూసింది. 1998లో టాటా ఇండికా తీవ్ర విఫలం చెందింది.
 • ఇండికా కారు మీద టాటా పెట్టుకున్న ఆశలు చివరికి ఆవిరయ్యాయి. చేసేదేమీ లేక, రతన్ టాటా మరియు అతని బృందం ఫోర్డ్ సహకారం కోసం అమెరికాకు వెళ్లారు. ప్యాసింజర్ కార్ల వ్యాపారంలో అధిక ఆసక్తికనబరిచిన డెట్రాయిట్ లోని ఫోర్డ్ ప్రతినిధుల వద్దకు వెళ్లారు.
 • మధ్య అమెరికాలో అప్పట్లో ఫోర్డ్ అతి ముఖ్యమైన ఆటోమొబైల్ సంస్థగా ఉండేది. ఫోర్డ్ హెడ్ క్వార్టర్స్ అమెరికాలోని డెట్రాయిట్‌లో ఫోర్డ్ బృందంతో టాటా గ్రూప్ ప్రతినిధులు సుమారుగా మూడు గంటల పాటు సమావేశమయ్యారు. అయితే ఫోర్డ్ నుండి ఎలాంటి సానుకూల స్పందనం లభించకపోగా, చేదు అనుభవం ఏదురైంది.
 • "మీకు కార్ల గురించి తెలియనప్పుడు, ప్యాసింజర్ కార్ల సెగ్మెంట్లోకి ఎలా వచ్చారు. మేము చేసే సహాయంతో ఏమిటంటే మీ సంస్థను పూర్తిగా పోర్డ్ స్వాధీనం చేసుకోవడం, ఆ తరువాత కూడా ఫోర్డ్‌గానే కొనసాగడం" అని ఫోర్డ్ చైర్మన్ భిల్ ఫోర్డ్ రతన్ టాటాతో అన్నారు.
 • బిల్ ఫోర్డ్ నుండి ఈ మాటలు విన్న తరువాత, రతన్ టాటా మరియు అతని బృందం మారు మాట్లకుండా అక్కడి నుండి నిరాశతో వెనుతిగారు. అయితే కొద్ది కాలానికే ఫోర్డ్ ప్యాసింజర్ కార్ల సెగ్మెంట్లో పట్టును కోల్పోవడం, టాటా మోటార్స్ బాగా రాణించడం జరిగింది.
 • 2008లో, ఫోర్డ్ మోటార్స్ దాదాపు పడిపోయింది, ఆ సంధర్భంలో ఫోర్డ్ మోటార్స్‌ను రతన్ టాటా గారు రక్షించడానికి ముందుకు వచ్చారు. నష్టాల్లో కూరుకుపోయిన ఫోర్డ్‌ను గట్టెక్కించడానికి ఫోర్డ్ లగ్జరీ కార్ల బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ సంస్థను రతన్ టాటా గారు కొనుగోలు చేశారు.
 • టాటా మోటార్స్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ సంస్థను సుమారుగా 2.3బిలియన్ డాలర్లు(అప్పట్లో మన కరెన్సీలో 9,300 కోట్లు) వెచ్చించి సొంతం చేసుకున్న తరువాత బాంబేలోని టాటా మోటార్స్ హెడ్ క్వార్టర్స్‌ బాంబే హౌస్‌కు బిల్ ఫోర్డ్ వచ్చాడు.
 • ఫోర్డ్ నెలకొల్పిన లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ కారణంగా తీవ్ర నష్టాన్ని చవిచూశాం. ఆ సమయంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను కొనుగోలు చేయడానికి రతన్ టాటా గారుముందుకొచ్చారు. జెఎల్ఆర్‌ను కొనుగోలు చేసి ఆదుకున్నందుకు బిల్ ఫోర్డ్ స్వయంగా ధన్యవాదాలు చెప్పారు.
 • 2014 లో రతన్ టాటా తరపున వైబి చవన్ నేషనల్ అవార్డు అందుకున్న ప్రవీన్ పి కడల్ మాట్లాడుతూ, 1999లో భారత్‌కు తెలియని అమెరికాలో వారికి ఎదురైన అవమానం గురించి చెప్పుకొచ్చారు. ఫోర్డ్ బృందంతో చర్చలు జరపడానికి రతన్ టాటాతో వెల్లిన ప్రవీన్ ఇప్పుడు టాటా క్యాపిటల్‌కు సిఇఒగా ఉన్నారు.
 • మీకు కార్ల గురించి ఏం తెలుసని హేళన చేసిన కంపెనీనే కొనుగోలు చేసి రతన్ టాటా ప్రతీకారం తీర్చుకున్నాడు. ప్రతి భారతీయుడి గర్వించదగిన ఈ సంఘటనను మీ స్నేహితులతో పంచుకోండి...
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)