ఇలా చేస్తే 5 సెకన్లలో గ్యాస్ ట్రబుల్ మాయం

ఇప్పుడు గ్యాస్టిక్ ప్రాబ్లం కూడా అత్యంత కామన్ అయిపోయింది. తిన్నది అరిగించుకోవడానికి పడే తంటాలు అన్నీ ఇన్నీ కావు. ఇక ఈ అరుగుదల సమస్యతో మొదలై కడుపులో మంటలు, యాసిడ్స్ రిలీజ్ కావడం, డైజేషన్ ఫంక్షనింగ్ అస్తవ్యస్థంగా మారడం వంటివి జరుగుతున్నాయి. ఆహారం సమయానికి తీసుకోకపోయినా, జీర్ణం కావడినికి ఎక్కువ సమయం పట్టే నాన్ వెజ్, ఫ్రైలు, పప్పు, జంక్ ఫుడ్ వంటివి తీసుకుంటే ఉంటే దీర్ఘకాలంలో గ్యాస్ ట్రబుల్ రావడం గ్యారెంటీ. అందుకే మందుల కంపెనీలు క్షణాల్లో మీ గ్యాస్ ట్రబుల్ కు చెక్ చెప్పండి అంటూ అనేక ఇంగ్లిష్ మందులు తయారు చేసి వేల కోట్లు వెనకేసుకుంటున్నాయి. మన సాంప్రదాయ వస్తువుల్లోనే ఈ అజీర్తికి, వాయువును అదుపులో ఉంచడానికి అనేక అమూల్యమైన సూచనలున్నాయి. ఆయుర్వేదంలో ఈ సమస్యను సమూలంగా నాశనం చేసే అనేక సూచనలెన్నో చేశారు. ఇంతకూ ఇంటిలోని పదార్థాలతో ఈ సమస్యను ఎలా ఎవయిడ్ చేయాలో కింద తెలుసుకుందాం..
ఒక గ్లాస్ నీళ్ళలో 1/4 స్పూన్ వాము, కొద్దిగా బ్లాక్ సాల్ట్ వేసి కలిపి దానిని భోజనం తరువాత తీసుకుంటే రిలీఫ్ ఇస్తుంది.

ఒక బౌల్ లో 1/4 స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు ఒక కప్పు వేడి నీరు వేసి మిక్స్ చేసి రోజూ తాగితే కొద్ది రోజుల్లోనే సమస్యను అదిగమిస్తారు.
ఒక గ్లాస్ నీటిలో నిమ్మరసం కలిపి ఉదయాన్నే తీసుకుంటే మంచిది. నిమ్మరసానికి బదులుగా వెనిగర్ ని వేసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది.
అర కప్పు వేడి పాలలో ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి కలిపి తాగిస్తే మంచిది.
ఒక గ్లాస్ నీటిలో అర స్పూన్ బేకింగ్ పొడి, ఒక స్పూన్ నిమ్మరసం వేసుకుంటే మంచిది. లెమన్ జ్యూస్ తీసుకున్నా కూడా గ్యాస్టిక్ సమస్యకు చెక్ పడుతుంది. రోజులో ఎక్కువగా నీరు తాగితు గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి.
ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక స్పూన్ తేనె, రెండు స్పూన్ల అల్లం రసం వేసి బాగా కలిపి రోజూ తీసుకుంటే రిలీఫ్ వస్తుంది
వేయించి పొడి చేసిన మిరియాలు, లవంగాలు, చిటికెడు వెల్లులి నీటిలో వేసి బాగా మరిగించి వడగట్టి తీసుకుంటే వెంటనే విముక్తి కలుగుతుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)