మీ ఫోన్ లో ఈ ఒక్క ఆప్షన్ ఉంటే చాలు ఎవరూ ఏమీ చేయలేరు, చూడలేరు

మీ ఫోన్ ని ఎప్పుడైనా ఎవరికైనా చూడడానికి ఇస్తున్నారా? అదే పనిగా మీ ఫ్రెండ్స్ మీ ఫోన్ కాసేపు ఇమ్మని అడుగుతున్నారా? అయితే వాళ్ళు మొదట చేసే పని మన ఫొటోస్, వీడియోస్, వాట్సప్ లేదా మెసెంజర్, ఇంపార్టెంట్ కాంటాక్ట్ లు ఓపెన్ చేస్తారు.. సోషల్ మీడియాలో పర్సనల్ చాట్ ఉంటుంది. ఇక ఆన్ లైన్ ట్రాన్జాక్షన్ యాప్స్ వచ్చాక వాటిల ద్వారా ఏదయినా చేయొచ్చు. ఇప్పుడు మన స్మార్ట్ ఫోన్ లో ఎంతో విలువైన సమాచారం నిక్షిప్తమై ఉంటోంది. అయినా ఫ్రెండ్స్, బంధువులు, సన్నిహితులు కాబట్టి ఫోన్ ఇవ్వనని అనలేం.. పర్సనల్స్ ఏమయినా ఉంటే అప్పుడు మనం అవ్వని డిలీట్ చేసి ఇయ్యాల్సి వస్తుంది..
సో మీ ఫ్రెండ్స్ కిఫోన్ ఇచ్చేపుడు ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ కనుక మీరు ఇనేబుల్ చేసి ఇస్తే సరిపోతుంది. అప్పుడు మీ ఫొటోలు, వీడియోలు, ఇంకా ఏమైనా పర్సనల్స్ కాని, విలువైన సమాచారం కాని మీ ఫ్రెండ్స్ కి ఏమాత్రం కనపడవు. అయితే కొన్ని ఫోన్లకు మాత్రమే ఈ ఆప్షన్ ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్స్ లో కచ్చితంగా 50 శాతం వరకు ఈ ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ మీ ఫోన్ లో ఉంటె కచ్చితంగా ఉపయోగించుకోండి..ఈ ఆప్షన్ పేరేంటి అంటే “గెస్ట్ మోడ్”
1. మీ ఫోన్ లో నావిగేషన్ బార్ అని ఒక ఆప్షన్ ఉంటుంది.. అందులో గెస్ట్ మోడ్ అని ఉంటుంది అది క్లిక్ చేయండి. మీ ఫోనులో ఉండే అప్ప్స్ కనిపిస్తుంది. అప్పుడు ఓకే పైన క్లిక్ చెయ్యండి..
2. అప్పుడు గ్యాలెరీ ఎంప్టీ చూపిస్తుంది. కాల్ లాగ్స్ కూడా ఎంప్టీ చూపిస్తుంది. ఓన్లీ సాంగ్స్ మాత్రం చూపిస్తుంది.
3. మీకు అప్పుడు ఒక అనుమానం వస్తుంది. అక్కడకి వెళ్లి డిసేబెల్ చేస్తే కనిపిస్తుందిగా అని. అప్పుడు ఆ గెస్ట్ మోడ్ కి pattern-Lock వేసుకునే అవకాశం ఉంటుంది. అది వేస్తె ఎట్టి పరిస్థితిలో కూడా అది ఓపెన్ కాదు. పాట్రన్ లాక్ వారికి తెలిస్తే మినహా.. అసలు ఇదంతా ఎలా చేయాలో స్పష్టంగా తెలుసుకుంటాం అంటే కింది వీడియోను చూసేయండి
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)