మీ స్మార్ట్ ఫోన్ తొందరగా ఛార్జ్ చేయాలంటే ఇవి ఫాలో అవండి

Smartphone వాడేటప్పుడు బానే ఉంటుంది. కానీ ఛార్జింగ్ పెట్టాల్సి వచ్చినప్పుడే చిరాకుగా ఉంటుంది. కొన్నిసార్లు మనం అర్జెంటుగా బయటకు వెళ్లాలి.. ఛార్జింగ్ చూస్తే 5-10 శాతం మించి ఉండదు. అలాంటప్పుడు వేగంగా phone charging అవ్వాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి.
మీకు వీలైతే phone switch offer చేసి ఛార్జింగ్ పెట్టండి, చాలా వేగంగా charging అవుతుంది. ఒకవేళ ముఖ్యమైన calls మిస్ అవుతారు అనుకుంటే wifi, mobile dataలనైనా ఆఫ్ చేయండి. అలాగే charging పెట్టినప్పుడు అస్సలు phoneని వాడకండి. ఒకవేళ మీ phoneలో power saving mode, ultra power saving mode లాంటివి ఏవైనా ఉంటే వాటిని ఎనేబుల్ చేసి ఛార్జింగ్ పెట్టండి.
ఎండా కాలం, అదీ బాగా వేడిగా ఉన్న రూమ్‌లో charging పెట్టినప్పుడు అంత వేగంగా ఛార్జింగ్ ఎక్కదు. అలాగే కొంత మంది powerbankలకి phoneని కనెక్ట్ చేసి జేబులో పెట్టేస్తుంటారు. దీనివల్ల వేడి విపరీతంగా ఉత్పత్తి అయి ఛార్జింగ్ కూడా సరిగా అవదు.
కొంత మంది తమ దగ్గర ఉన్న computer, laptopల యొక్క USB పోర్టుల నుండి phoneని ఛార్జ్ చేస్తుంటారు. ఈ పద్ధతిలో ఛార్జింగ్ చాలా స్లోగా అవుతుంది. నేరుగా wall outlet ద్వారా ఛార్జింగ్ చేసుకోండి. మీ phone fast charging, turbo charging వంటి టెక్నాలజీలను సపోర్ట్ చేసేదైతే fast chargerని వాడితే phone వేగంగా ఛార్జ్ అవుతుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)