మీ ఇంట్లోని ఈ 5 వ‌స్తువుల స‌రిగ్గా ఉంటే.. మీకు ఆర్థిక స‌మ‌స్య‌లు తొల‌గిన‌ట్టే

మంచి ఇల్లు, విలాస‌వంత‌మైన జీవితం, దానికి త‌గిన ధ‌నం… ఇవ‌న్నీ ఉంటే ఇక అంత‌క‌న్నా సంతోష‌మైన జీవితం ఏముంటుంది చెప్పండి. అన్నీ అనుకున్న విధంగా జ‌రిగి ధ‌నం ఎప్ప‌టిక‌ప్పుడు ల‌భిస్తుంటే ఎవ‌రికైనా ఆనందంగానే ఉంటుంది. కానీ అన్ని రోజులు మ‌న‌వి కాదు క‌దా, కొన్ని సంద‌ర్భాల్లో అనుకోకుండా వ‌చ్చే ధ‌నం రాదు, ఉన్న ధ‌నం కూడా ఖ‌ర్చ‌యిపోతుంది. అయితే అందుకు ఇంట్లో ఉండే వాస్తు కూడా కార‌ణం కావ‌చ్చు. మ‌రి అలాంట‌ప్పుడు ఏం చేస్తే బాగుంటుందో, ఏం చేస్తే పోయే ధ‌నం తిరిగి వ‌స్తుందో, మిక్కిలి సంప‌ద క‌లుగుతుందో తెలుసా..? ఆ వాస్తు టిప్స్ గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
1. కుబేరుడు
కుబేరుని గురించి తెలుసు క‌దా. ధ‌నం, ఐశ్వ‌ర్యానికి అధిప‌తి ఈయ‌న‌. ఈయ‌న ఉత్త‌ర దిక్కుకు అధిప‌తి. క‌నుక‌ ఉత్త‌రం వైపు ముఖం ఉండేలా ఇంట్లోని లాక‌ర్లు, వార్డ్ రోబ్స్‌, క‌ప్‌బోర్డుల‌ను పెట్టాలి. దీంతో వాటిని ఓపెన్ చేయ‌గానే ఉత్త‌రానికి వాటి ముఖం ఉంటుంది. క‌నుక కుబేరుని అనుగ్ర‌హం క‌లుగుతుంది. అప్పుడు ధ‌నం స‌మ‌కూరుతుంది. ధ‌నం అన‌వ‌స‌రంగా వృథాగా ఖ‌ర్చు కాదు.
2. అద్దం
లాకర్ లేదా వార్డ్‌రోబ్ ఎదురుగా ఓ అద్దం ఉంచాలి. దీంతో అదృష్టం క‌లుగుతుంది. అంద‌రి ఆరోగ్యం బాగుంటుంది. ధ‌నం మిక్కిలిగా సంపాదిస్తారు. ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది.
3. దూలాలు, మెట్లు
దూలాలు, మెట్ల కింద సేఫ్టీ లాక‌ర్‌, క్యాష్ సేఫ్‌లు, బాక్స్‌లు, వార్డ్ రోబ్‌ల‌ను పెట్ట‌రాదు. అలా పెడితే ఆర్థిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. డ‌బ్బు ఖ‌ర్చ‌వుతుంది. ఏ ప‌ని చేసినా క‌ల‌సి రాదు.
4. లాక‌ర్ ఉన్న గ‌ది
డ‌బ్బుల‌ను ఉంచే గ‌ది, లాక‌ర్‌, సేఫ్టీ బాక్సులు ఉంచే గ‌ది ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉండాలి. విశాలంగా ఉండాలి. ఎక్కువ సామాన్లు ఉండ‌రాదు. అలాగే ఆ గ‌దిలో ఉత్త‌రంలో కిటికీ ఏర్పాటు చేసుకుంటే మంచిది. దీంతో ధ‌నం మిక్కిలిగా స‌మ‌కూరుతుంది. అలాగే ఆ గ‌దికి తూర్పు వైపున ఓ కిటికీ పెట్టుకుంటే వ్యాపారంలో లాభాలు, ప్ర‌గ‌తి సాధిస్తారు.
5. మ‌నీ ప్లాంట్
ఇండ్ల‌లో పెంచుకునే మ‌నీ ప్లాంట్ గురించి తెలిసిందే క‌దా. అయితే ఈ ప్లాంట్‌ను ఇంట్లో ఎక్క‌డ ప‌డితే అక్క‌డ పెట్ట‌కూడ‌దు. కేవ‌లం నైరుతి దిశ‌లోనే పెట్టాలి. అలా పెడితేనే వాస్తు దోషం ఉండ‌దు. దీంతో ధ‌నం ల‌భిస్తుంది. కోరుకున్న‌ది నెర‌వేరుతుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)