తను చనిపోతునదని తెలిసి భార్య కోరిక తీర్చిన భర్త, ఆ కోరిక

భయంకర క్యాన్సర్ తో భాదపడుతూ ఉన్న తన భార్యను రక్షించడానికి చేయాల్సిందంతా చేస్తున్నాడు. డాక్టర్స్ కూడా ఆమె ను కాపాడటానికి శతవిదలా ప్రయత్నం చేస్తున్నారు. కోచిలోని ఓ హాస్పటల్ లో రెండోసారి కేమో తెరపి అబ్సర్వేషన్ లో పెట్టారు. ఆమెకు సచిన్ టెండూల్కర్ అంటే చాలా ఇష్టం. మరో నాలుగు రోజుల్లో కోచిలో ఇండియన్ పుట్ బాల్ మ్యాచ్ జరగనుంది. పుట్ బాల్ మ్యాచ్ ఆటగాళ్ళలో ఆత్మ విశ్వాసం నింపడానికి సచిన్ అక్కడకు వస్తున్నాడు. తన అభిమాన క్రికెటర్ సచిన్ కోచి వస్తున్నాడన్న సంగతి ఆమెకు ఆనందాన్ని కలిగించింది. ఎలాగైనా సచిన్ ను చూడాలని ఆ ఫుట్ బాల్ మ్యాచ్ కి తీసుకెళ్లమని తన భర్తను అడిగింది. ఆయన ఇలాంటి పరిస్థిలో ఎందుకు మరోసారి తీసుకెళ్తాను అని చెప్పాడు.
కానీ నిజమేంటో అతనికి తెలుసు తనకు మరో అవకాశం రాదని. అందుకే మనసు మార్చుకున్నాడు. ఎలాగైనా భార్య కోరిక తీర్చాలనుకున్నాడు. దానికోసం తన ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి ఎలాగైనా టికెట్స్ కావాలని చెప్పాడు. ఎంత కష్టమైన క్యూ లో ఎంత సేపు నిలబడైన టికెట్స్ సంపాదించాలని సూచించాడు. పరిస్థితి దిగజారితే తనను వెంటనే చికిత్సకు తరలించాలి. స్టేడియం దగ్గరో ఉన్న హాస్పటల్ కి అంబులెన్స్ లకు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వాళ్ళకు కావాల్సిన జాగ్రతలు తీసుకున్నాడు. ఆమెను తీసుకొని మ్యాచ్ కి వెళ్ళాడు. వేలాది మంది ప్రేక్షకుల కేరింతలు చూసి తెగ ఆనంద పడింది. సచిన్ సచిన్ అనే అరుపులు విని ఆమె భాదనంత మరిచిపోయింది. 
ఆ సమయంలో ఆయన భార్య ఆయనకి ఎంతో అందంగా కనిపించిందట. రమేష్ తన భార్య కోరిక తీర్చి ప్రపంచాన్ని జైయించినంత ఆనందాన్ని పొందాడు. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. కొద్ది రోజులకే రమేష్ భార్య చనిపోయింది. ఆమె చనిపోయిన తన జ్జాపకాలు వెంటాడుతున్నాయి. గత ఏడాది తన భార్య చివరి కోరిక తీర్చిన తీరును ఆ సందర్భంలో కలిగిన ఆనందం, అనుభూతిని తన పేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసాడు. తన ఫ్యామిలీతో స్టేడియం లో దిగిన ఫోటోను కూడా పోస్ట్ చేసాడు. 
నా భార్య చాల దైర్యవంతురాలు కొద్ది రోజుల్లో చనిపోతుందని తెలిసిన దైర్యంగా ఉండేది. జీవితం ఎంతో అందమైనది ప్రతి క్షణం ఆస్వాదించండి. గాడ్ బ్లెస్ యు అంటూ రాసాడు. వారికీ అపురూపంగా పుట్టిన కొడుకును అపురూపంగా చూసుకుంటూ రోజులు గడుపుతున్నానని చెప్పుకోచ్చాడు. భార్య పట్ల రమేష్ చూపించిన ప్రేమకు నెటిజన్లు హాట్సాఫ్ చెబుతున్నారు. భారమైన గుండె తో రమేష్ కి అభినందనలు చెబుతున్నారు. భార్య బ్రతికుండగానే నరకం చూపిస్తున్న ఈ రోజుల్లో రమేష్ లాంటి వాళ్ళు అరుదే కదా. అలాంటి భర్త ప్రేమకు దూరమైన అభాగ్యురాలు పేరు అజు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)