మీరు ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు చేసే అతి పెద్ద తప్పులు

ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ల వాడకం చాల ఎక్కువైపోయింది. అది కాక ఏది కావాలన్న ఇంటర్నెట్ లో వెతుక్కోవడము దాన్ని అనుసరించటం జరుగుతుంది. ప్రతిది ఆన్లైన్లోనే జరిగిపోతుంది. వీటన్నింటికి కావల్సినది స్మార్ట్ ఫోన్. అందుకే ఈ మొబైల్స్ వాడకం ఎక్కువ అయింది. అయితే ఈ మొబైల్స్ వాడేవారు అవి ఎక్కువ కాలం మన్నికగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఇలా చేయడం వలన ఫొన్ ను చాల రోజులపాటు వాడుకోవచ్చు. అవి ఏమిటో ఇప్పుడు చుద్దాం.
మొబైల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు కొంతమంది ఛార్జింగ్ పెట్టి డాన్ని కిందకు వేలాడేస్తారు లేదా ఛార్జింగ్ పెట్టిన మొబైల్ ను చార్జర్ పైన పెడతారు కానీ ఇలా చేయడం వలన మొబైల్ హీట్ అవుతుంది దీనివలన మొబైల్ బ్యాటరీ లైఫ్ టైం తగ్గిపోతుంది. 
ఎప్పుడైనా మొబైల్ల్లో ఛార్జింగ్ 15 లేదా 20 పర్సెంట్ కు పడిపోగానే ఛార్జింగ్ పెట్టాలి కానీ పుర్తిగా అయిపోయిన తర్వాత  పెట్టకూడదు ఇలా చేస్తే మొబైల్ బ్యాటరీ లైఫ్ టైం తగ్గిపోతుంది. ఎప్పుడైనా మొబైల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసిగాని ఫ్లైట్ మోడ్ ఆర్ ఏరోప్లేన్ మోడ్ లో గాని ఉంచి ఛార్జింగ్ పెట్టాలి ఇలా చేయడం వలన మొబైల్ లోని processing ఫంక్షన్స్ అన్నీ ఆగిపోయి మొబైల్ ఫాస్ట్ గా ఛార్జింగ్ ఎక్కుతుంది.
మొబైల్ ను ఎప్పుడైనా డూప్లికేట్ చార్జర్ తో కనెక్ట్ చేసి ఛార్జింగ్ పెట్టొద్దు అంటే ఏ బ్రాండ్ మొబైల్ ను ఆ బ్రాండ్ చార్జర్ తోనే ఛార్జింగ్ పెట్టాలి. ఇలా చేయడం వలన బ్యాటరీ ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది,సేఫ్ గా ఉంటుంది. 
మొబైల్ ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడడం, చాటింగ్ చేయడం, వీడియోస్ చూడడం, గేమ్స్ ఆడడం లాంటివి చేయకూడదు ఇలా చేయడం వలన ఒకొక్కసారి మొబైల్ పేలి మన ప్రాణాలకే ప్రమాదం వస్తుంది. ఎప్పుడైనా ఫోన్లో ఛార్జింగ్ తక్కువగా ఉన్నప్పుడు ఫొన్ మాట్లాడకూడదు ఇలా చేయడం వలన ఫోన్లో ఎక్కువ రేడియేషన్స్ జనరేట్ అవుతాయి దాంతో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. 
అలాగే ఫొన్ ను ఎప్పుడైనా హీట్ గా ఉండే ప్రదేశాలలో అనగా ఫ్రిడ్జ్, టీవి, వాషింగ్ మిషన్ లాంటి వాటిమీద పెట్టకూడదు అలా చేయడం వలన బ్యాటరీ ఉబ్బడంలాంటివి జరిగి బ్యాటరీ లైఫ్ టైం తగ్గిపోతుంది కావున ఇలాంటివి అవాయిడ్ చేసి ఫొన్ జాగ్రత్తగా పెట్టుకోండి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)