పోస్టాఫీస్ లోని అద్బుతమైన ఈ 8 పథకాలు తెలిస్తే ఇక మీరు బ్యాంకు లో డబ్బులు వేయరు

భారత దేశంలో ఇప్పుడు బ్యాంకుల హవా నడుస్తోంది. ఆర్థిక లావాదేవీలన్నా ఆన్ లైన్ లోనే చేయాలంటూ ప్రభుత్వం విధించిన షరతు బ్యాంకులు, అందులో పనిచేసే ఉద్యోగులు చాలా మందికి కొమ్ములు తీసుకొచ్చింది. డిజిటల్ ఇండియా పేరిట దేశీయ ఫైనాన్షియల్ కార్యకలాపాలన్నీ బ్యాంకుల ద్వారా మాత్రమే జరిగేలా తీసుకుంటున్న చర్యలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆల్టర్నేటివ్స్ కోసం వెతుకుతున్న వారికి ఇండియన్ పోస్టల్ సర్వీస్ గొప్ప అవకాశంగా కనిపిస్తోంది. మన దేశ పోస్ట్‌ ఆఫీస్‌ నెట్‌వెర్క్‌ ప్రపంచంలోనే అతిపెద్దది. దాదాపు ఒకటిన్నర లక్షల పోస్టల్‌ కార్యాలయాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. 90శాతం గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్‌ సేవలు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఉత్తరాల బట్వాడాకు మాత్రమే పరిమితమైన పోస్టల్ శాఖ కొత్తగా బ్యాంకింగ్ రంగంలోకి అడుగిడింది. ఇప్పుడు ఆ శాఖ అమలు చేస్తున్న ప్రత్యేక పథకాల గురించి తెలుసుకుంటే ఇక బ్యాంకులు ఎందుకు దండగ అనకుండా ఉండలేరు..
నెలవారీ ఆదాయ పథకం(మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌):
ఈ పథకంలో మొదట తగినంత పెట్టుబడి పెట్టాలి. అయిదేళ్ల కాలపరిమితి తర్వాత పెట్టుబడిదారులకు నెలవారీ వడ్డీతో కలిపి రాబడిని అందిస్తారు. వచ్చిన రాబడి పొదుపు ఖాతాలో దానంతట అదే జమ అయ్యేలా చూసుకునే వెసులుబాటును తపాలా కార్యాలయాలు అందిస్తున్నాయి.
పోస్టల్ సేవింగ్ అకౌంట్:
బ్యాంకుల్లో మాదిరిగానే సేవింగ్ అకౌంట్ ను కేవలం రూ.50లతోనే తీయొచ్చు. చెక్ బుక్ ఫెసిలిటీ కావాలంటే మాత్రం ఖాతాలో రూ.500 ఉంచాలి. ఈ అకౌంట్ లో ఎంత డబ్బు అయినా డిపాజిట్ చేసుకోవచ్చు. బ్యాంకుల్లో వలే 4శాతం వార్షిక వడ్డీ చెల్లిస్తారు.
రికరింగ్‌ డిపాజిట్ల్:
పోస్టల్ ఆర్ డీ లు ఎప్పటి నుంచో ఫేమస్. ఈ ఖాతా క‌నీస కాల‌ప‌రిమితి 5ఏళ్లు. అంటే 60నెల‌లపాటు క్ర‌మంగా పొదుపుచేసి, చివ‌ర్లో ఏక‌మొత్తంగా విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. ప్రతి నెలా రూ.10 నుంచి ఎంతయినా ఈ ఖాతాలో వేసుకోవచ్చు. 7.2శాతం వార్షిక వడ్డీని ప్రతి మూడు నెలలకు ఓసారి లెక్కించి అసలుతో కలుపుతారు.
ప్రజా భవిష్య నిధి(పీపీఎఫ్‌):
దీర్ఘకాలం మదుపు చేయాలనుకునే వారికి ఈ పథకం ఉపయుక్తంగా ఉంటుంది. 15ఏళ్ల కాలపరిమితితో ఉండే వీటిలో పెట్టుబడి పెట్టేందుకు గరిష్ఠ పరిమితి లేదు. కొన్ని నిబంధనలతో పన్ను మినహాయింపు ఉంటుంది. పీపీఎఫ్‌పై విత్‌డ్రాయల్‌ తోపాటు రుణసౌకర్యం ఉంటుంది. స్వయం ఉపాధి, ప్రైవేటు రంగాల ఉద్యోగులకు రిటైర్మెంటు తర్వాత ఆర్థిక భరోసా కల్పించడం ఈ పథకం ముఖ్యోద్దేశం. క‌నీసం రూ.500 పెట్టుబ‌డి పెట్టాల్సి ఉంటుంది. ఓ ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా రూ.1,50,000 వరకూ పెట్టుబడి పెట్టవచ్చు. పీపీఎఫ్‌ పై వార్షిక వడ్డీ 7.8 శాతం చెల్లిస్తారు. వడ్డీకి చక్రవడ్డీ జ‌మ‌చేసి ఖాతాలో చేరుస్తారు.
టైమ్‌ డిపాజిట్‌:
ఇవి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లాంటివి. 1-5 ఏళ్ల నిర్ణీత కాలపరిమితితో ఉండే ఈ పథకాల్లో సంవత్సరానికి రాబడిపై చక్రవడ్డీ లెక్కించి ఇస్తారు. వచ్చిన రాబడి పొదుపు ఖాతాలోకి నేరుగా మళ్లించేలా సౌలభ్యం ఉంటుంది. పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్‌ ఖాతా బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలాంటివే. నిర్దిష్ట కాలానికి ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టేవారికోసం రూపొందించింది ఈ పథకం. క‌నీసం రూ.200 నుంచి ఎంతయినా ఈ పథకంలో డిపాజిట్ చేయొచ్చు.
సీనియర్ సిటిజన్స్:
కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసుల ద్వారా సీనియర్‌ సిటిజన్స్‌ కోసం ప్రత్యేకమైన పథకాన్ని రూపొందించింది. పదవీ విరమణ చేసినవారికి ఈ పథకం ఎంతో అనుకూలమైంది. పదవీ విరమణ తర్వాత వచ్చే ఆర్థిక అవసరాలను ఈ పథకం తీరుస్తుంది. 60ఏళ్లు దాటిన వారే అర్హులు. ఆర్మీలో రిటయిర్ అయిన వారికి ఎటువంటి నిబంధనలు లేవు. ఈ పథకంలో కేవలం జీవితభాగస్వామితో కలిసి మాత్రమే ఉమ్మడి ఖాతా తెరిచే అవకాశం ఉంటుంది. రూ.15లక్షల వరకు ఈ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు. కనీసం 5యేళ్లు కొనసాగించాలి. 8.4శాతం వార్షిక వడ్డీ ఇస్తారు.
ఎన్ఎస్ సీ బాండ్లు:
చిన్న మొత్తాల్లో పొదుపు చేయాలనుకునేవారి కోసం భారత ప్రభుత్వం పోస్టాఫీసుల ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించింది. కచ్చితమైన రాబడి ఆశించేవారికి సురక్షితమైన పెట్టుబడి మార్గం ఇది. ఐదేళ్ల మెచ్యూరిటీ పీరియడ్‌తో జాతీయ పొదుపు ప‌త్రాల పథకం (ఎన్ఎస్ సీ బాండ్లు) అందుబాటులో ఉంది. ఈ బాండ్లు రూ.100, రూ.500, రూ.1000, రూ.10,000 డినామినేషన్లలో అమ్ముతారు. వడ్డీ రేటును 7.9 శాతంగా నిర్ణయించారు. ఆరు నెలల చక్రవడ్డీ వ‌ర్తింప‌జేసి పెట్టుబ‌డికి జ‌మ‌చేస్తారు.
కిసాన్ వికాస్ ప‌త్రాలు:
మ‌దుప‌ర్ల‌ను ప్రోత్స‌హించేందుకు ఈ ప‌థ‌కాన్ని తీసుకొచ్చారు. జాతీయ పొదుపు ప‌త్రాల‌కు ద‌గ్గ‌రి పోలిక‌లున్నఈ కేవైపీలో పెట్టిన పెట్టుబ‌డి 110 నెల‌ల్లో రెట్టింపు అవుతుంది.
సుక‌న్య స‌మృద్ధి ప‌థ‌కం:
ఆడ‌పిల్ల‌ల చ‌దువు, పెళ్లి స‌మ‌యంలో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ప‌డ‌కుండా అవ‌స‌రానికి త‌గినంత సొమ్ము స‌మ‌కూర్చుకునే అవ‌కాశాన్ని సుక‌న్య స‌మృద్ధి ప‌థ‌కం క‌లిగిస్తుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)