ఇంటర్వ్యూకి వెళ్తున్నారా ? రెజ్యూమ్‌లో ఈ 10 పదాలు వాడకపోవడమే మంచిదట..!

బీటెక్, డిగ్రీ, పీజీ.. ఎడ్యుకేషన్ ఏదయినా సరే.. అందరి అంతిమ లక్ష్యం ఓ మంచి జాబ్. ‘ఇల్లును చూసి ఇల్లాలిని చూడాలి’ అనే సామెతలాగే... రెజ్యూమ్ చూడు.. ఆ తర్వాతే అభ్యర్థిని చూడు అనేది ఇంటర్వ్యూ పరిభాషలా మారింది. అందుకే తన లక్షణాలు, విద్యార్హతలు, గుణగణాలు, సాధించిన విజయాలన్నింటినీ సీవీలో ఏకరువు పెడుతుంటారు కొందరు. కొందరు సింపుల్‌గా ఒక పేజీలో సీవీని పూర్తి చేస్తే.. మరికొందరు రెండు పేజీల్లో తమ రెజ్యూమ్‌ను రూపొందిస్తారు. పదో తరగతి నుంచి మొదలుకుని.. చివరి విద్యాభ్యాసం వరకూ అన్ని వివరాలను పొందుపరుస్తారు. టెక్నికల్ నాలెడ్జి ఎంత ఉందో కూడా చెప్పేస్తారు.

ఇంటర్వ్యూల్లో కొన్ని వేల రెజ్యూమ్‌లను చూసిన నిపుణులు.. ఆసక్తికరమయిన విషయాలను వెల్లడిస్తున్నారు. రెజ్యూమ్‌ను చూసి అభ్యర్థి ఏంటనేది 70 శాతం వరకూ చెప్పగలమంటున్నారు. దాదాపు 80 శాతం మంది అభ్యర్థులను రెజ్యూమ్ చూసే రిజెక్ట్ చేస్తుంటామని కూడా తెలిపారు. రెజ్యూమ్‌లో అభ్యర్థులు అందరూ కొన్ని కామన్ పదాలను వాడుతంటారనీ, తద్వారా వారిలో ఆలోచన గుణం లేదని స్పష్టమవుతుందని చెబుతున్నారు. నిరుద్యోగులు ఓ పది పదాలను రెజ్యూమ్‌లో పదేపదే వాడుతుంటారనీ, అవి ఇంటర్వ్యూ చేసే వారికి ఎబ్బెట్టుగా కనిపిస్తుంటాయంటున్నారు. మరి ఆ పది పదాలంటో ఓ లుక్కేయండి.. వాటిని మీ రెజ్యూమ్‌లో సాధ్యమైనంత తక్కువగా, వీలయితే అసలే లేకుండా చూసుకోండి.

  1. ‘leadership’,
  2. ‘specialised’
  3. ‘expert’.
  4. ‘excellent,’
  5. ‘strategic’
  6. ‘experienced.’
  7. ‘responsible,’
  8. ‘passionate,’
  9. ‘certified’
  10. ‘dynamic.’
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)