నిన్న 'ఈగ'.. నేడు 'చేప'..? నాని సరికొత్త ప్రయోగం

టాలీవుడ్ యువ హీరో నాని విభిన్నపాత్రలు పోషించేందుకు ఎపుడూ ముందుంటారు. గతంలో దర్శకధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని "ఈగ" పాత్రను పోషించారు. ఈ చిత్రంలో స‌మంత, సుదీప్ ప్ర‌ధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నాలు సృష్టించింది.

ఈ చిత్రాన్ని స్ఫూర్తితో కొన్ని కీట‌కాలను ప్ర‌ధాన పాత్ర‌లుగా తీసుకొని సినిమాలు తీయాల‌ని కొంద‌రు ద‌ర్శ‌కులు భావిస్తున్నట్టు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. క‌ట్ చేస్తే ఇప్పుడు నాని చేప‌గా క‌నిపించ‌నున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది.

కొత్త ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో నాని ప్ర‌ధాన పాత్ర‌లో ఓ సినిమా తెర‌కెక్కుతుంద‌ని టాక్. ఓ భారీ సె‌ట్‌లో ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతుంద‌ని , ఇందులో నాని చేపగా క‌నిపిస్తాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు ఈ చిత్రానికి నానినే నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని ఫిల్మ్ నగర్ వర్గాల సమచారం.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)