టెన్త్ క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్ పోయిందా…? ఇప్పుడు చాలా సులభంగా తిరిగి పొందొచ్చు ఇలా..


ఇప్పుడు చాలా పనులకు టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ గా ఇవ్వాల్సి వస్తోంది. ఏదైనా జాబ్ కి అప్లయ్ చేయాలన్నా, బర్త్ సర్టిఫికేట్, పాస్ పోర్ట్, క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి పొందాలంటే తప్పనిసరిగా ఎస్.ఎస్.సి. సర్టిఫికేట్ (టెన్త్ మెమో) కావల్సి వస్తోంది. ఎందుకంటే ఈ మెమోలోని డేట్ ఆఫ్ బర్త్ ని ఆధారంగా చేసుకుని ఆయా సర్టిఫికెట్లు జారీ చేస్తారు. అందుకే ఎస్.ఎస్.సి. సర్టిఫికెట్ అందరికీ తప్పనిసరిగా కావాలి. అది లేకుండా ఉద్యోగానికి, పై చదువులకి సంబందించిన ఏ పని జరగదు. ఎంతో ముఖ్యమైన ఎస్.ఎస్.సి. ఒరిజినల్ సర్టిఫికెట్ ని పోగొట్టుకున్నవాళ్లు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఎంత జాగ్రత్తగా భద్రపర్చుకున్నా ప్రయాణ సంధర్భంలోనో, ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించినప్పుడో, ఎలుకలు కొట్టినప్పుడో, వర్షాలు, వరదల వల్లనో ఆ సర్టిఫికేట్స్ పాడైపోవడమో/ పోగొట్టుకోవడమో జరుగుతూ ఉంటుంది.
ఇలా సర్టిఫికేట్ పోగొట్టుకుంటే ఇంతకు ముందు అయితే ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేల తిరగాల్సి వచ్చేది. కాని ఇప్పుడు ఇప్పుడు అలా తిరగాల్సిన అవసరం లేదు. చాలా సులభంగా ఇంటర్ నెట్ నుండి ఎక్కడైనా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కింది లింక్ ఓపెన్ చేసి మీ ఎస్ఎస్ సి మెమోను ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో కింద చూడండి..
ఎస్.ఎస్.సి. ఒరిజినల్ సర్టిఫికేట్ డౌన్ లోడ్ చేసుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.

  • ముందుగా ఈ వెబ్ సైట్ ఓపెన్ చేయండి  memos.bseapwebdata.org
  • అందులో ఎస్.ఎస్.సి. బోర్డ్ కు సంబంధించిన డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ పేజ్ కనిపిస్తుంది. అందులో మీ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఏ సంవత్సరం రాశారు? రెగ్యులరా? సప్లమెంటరీనా? ప్రైవేటా? అని ఉంటుంది. వాటి కింద ఒక నెంబర్ కోడ్ ఉంటుంది. అందులో టైప్ చేసి సబ్ మిట్ పై క్లిక్ చేయండి.
  • ఆ విధంగా మీ డిటైల్స్ అన్నీ ఎంటర్ చేసి సబ్ మిట్ చేయగానే, మీ కళ్ళ ముందు మీ ఒరిజినల్ సర్టిఫికేట్ కనబడుతుంది.
  • మీ ఎస్.ఎస్.సి. ఒరిజినల్ సర్టిఫికెట్ ను మీ దగ్గర సేవ్ చేసుకోవాలంటే, ఒరిజినల్ సర్టిఫికెట్ కనిపిస్తున్న చోట ఎడమచేయి వైపు పైన ‘ప్రింట్ దిస్ పేజ్’ పై క్లిక్ చేయండి.
  • ఇలా క్లిక్ చేయగానే ‘సేవ్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సేవ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ డెస్క్ టాప్ మీద మీకు అనువైన చోట భద్రంగా దాచుకోవచ్చు.
  • అలా ఎస్.ఎస్.సి. సర్టిఫికెట్ ను పోగొట్టుకున్న వారు తిరిగి ఈజీగా పొందొచ్చు.

Popular Posts

Latest Posts